cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అది భోగి మంట కాదు.. బాబు కడుపు మంట

అది భోగి మంట కాదు.. బాబు కడుపు మంట

తను స్పందించాలనుకుంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై సైతం స్పందించే అవకాశవాది చంద్రబాబు. అదే వద్దనుకుంటే మాత్రం, ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై సైతం నోరు మెదపని పక్కా స్వార్థ రాజకీయవాది. పోనీ రైతుల గురించి బాబు నోరు కట్టేసుకున్నారా అంటే అది లేదు.

తాజాగా భోగి మంటల్లో ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తగలబెట్టి రాక్షసానందం పొందారు బాబు అండ్ కో. రైతుకంటకుడు జగన్ అంటూ దుమ్మెత్తిపోశారు. అసలింతకీ చంద్రబాబుకి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అనేదే బేసిక్ పాయింట్.

రైతు రుణమాఫీ అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తో 2014లో అధికారంలోకి వచ్చిన బాబు.. దాదాపు 15 శాతం అయినా రుణాలు మాఫీ చేయలేదు. ఆ కడుపుమంటతోనే బాబు చేతిలో 23 సీట్లు పెట్టి చాలుపో అని గెంటేశారు రైతులు, సామాన్య ప్రజలు. ఆ తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని రైతుల విషయంలో నిజాయితీగా ఉన్నారా అంటే అదీ లేదు.

తాము బకాయి పడ్డ సొమ్ముని వైసీపీ ప్రభుత్వం చెల్లించాలంటూ చెత్త లాజిక్ తీసి నవ్వులపాలయ్యారు. రైతు భరోసా నిధులు, రైతు భరోసా కేంద్రాలు, గిట్టుబాటు ధరలకు ధాన్యం సేకరణ, ఇన్ పుట్ సబ్సిడీలతో ఏపీలో రైతులు సంతోషంగా ఉంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. రైతు వ్యతిరేక జీవోలంటూ భోగి మంటల్లో పేపర్లు తగలబెట్టి ఓ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసి రెచ్చిపోయారు.

తెల్ల పంచె, మెడలో పచ్చ కండువా వేసుకున్నంత మాత్రాన చంద్రబాబుని రైతులు నమ్ముతారనుకుంటే అది ఆయన భ్రమ. వ్యవసాయం దండగ అన్న బాబు, వ్యవసాయం పండగ అని మాట మార్చినా, ఆయన చేతలు మాత్రం అందుకు సహకరించవు. అందుకే బాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే అనేది ఏపీ ప్రజల నిశ్చితాభిప్రాయం. కొడుకు లోకేష్ ని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు పంపించి హడావిడి చేసినంత మాత్రాన ఏమీ ఒరగలేదు.

అసలు రైతులకు లేని ఆవేదన కేవలం బాబుకి మాత్రమే ఎందుకో ఆయన అనుకూల మీడియాకి తప్ప ఇంకెవరికీ అర్థం కాని విషయం. అంతగా రైతుల కష్టాలపై కన్నీరు కార్చే గుణమే ఉంటే.. ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ నిరసన తెలుపుతున్న రైతుల గురించి బాబు ఒక్కమాటయినా మాట్లాడారా? కేంద్రం తెచ్చిన చట్టాలపై సుప్రీంకోర్టు స్టే విధించినా బాబు నోరు మెదిపారా..?

అక్కడ రైతుల బాధలు కళ్లకు కట్టినట్టున్నా బాబుకి నోరు పెగలదు, ఇక్కడ రైతులంతా సంతోషంగా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతే మాత్రం ఆయనకి కడుపుమంట. చంద్రబాబు వేసినవి భోగిమంటలు కాదు.. ఆయన కడుపుమంటలు అని సెటైర్లు పడుతున్నాయి.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×