Advertisement

Advertisement


Home > Politics - Political News

గ్రేట్ ఆన్‌లైన్ మాస్టార్...ఆల‌సించిన ఆశా భంగం

గ్రేట్ ఆన్‌లైన్ మాస్టార్...ఆల‌సించిన ఆశా భంగం

ఆయ‌న అనుభ‌వం 40 ఏళ్లు. ఎస్వీ యూనివ‌ర్సిటీ నుంచి ఎక‌నామిక్స్‌లో ప‌ట్ట‌భ‌ద్రుడు. ఆయ‌న్ను అనేక పుర‌స్కారాలు వెతుక్కుంటూ వ‌చ్చి అలంక‌రించాయి. ప‌ద‌వుల‌కు,పుర‌స్కారాల‌కు ఆయ‌న అలంకార‌మే త‌ప్ప‌...ఆయ‌న‌కు అవి ఎంత మాత్రం అలంకారం కానే కాదు.

ఇండియా టుడే నుంచి "ఐ.టి ఇండియన్ ఆఫ్ ద మిలీనియం", ద ఎకనమిక్ టైమ్స్ నుంచి "బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్", టైమ్స్ ఆసియా నుంచి "సౌత్ ఏషియన్ ఆఫ్ ద ఇయర్", ప్రపంచ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్ లో సభ్యుడు వంటి పురస్కా రాలు వాటిక‌వే వ‌చ్చాయంటే న‌మ్మండి.

ఇక ప‌ద‌వులంటే అస‌లు ఆయ‌న‌కు ఇష్టం లేదు. మ‌రి ఎన్టీఆర్‌ను సీఎం కుర్చీ నుంచి అర్ధాంతంగా దించడంపై ప్ర‌శ్నిస్తున్నారా?  మీరు భ‌లే వారండి. భార్య రూపంలో ఒక రాజ్యాంగేత‌ర శ‌క్తి ఎన్టీఆర్‌ను గుప్పిట్లో పెట్టుకుని ఆడిందే ఆట‌, పాడిందే పాట అని తోలుబొమ్మ‌లాట ఆడిస్తుంటే...బాధ్య‌త గ‌ల అల్లుడిగా, పార్టీ లో కీల‌క నాయ‌కుడిగా ఆ మాత్రం వెన్నుపోటు పొడ‌వ‌డంలో త‌ప్పేంటి? అస‌లు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నాటి నుంచి నేటి వ‌ర‌కు స‌ర్వ‌హ‌క్కులు ఆయ‌న‌కే సొంతం.

యూట‌ర్న్‌కు ఆయ‌నే హ‌క్కుదారుడు. తాను అధికారంలో ఉంటే మాత్రం వ‌ద్దంటాడు, ప్ర‌తిప‌క్ష‌మైతే రైట్‌రైట్ అంటాడు. తిమ్మిని బ‌మ్మి, బ‌మ్మిని తిమ్మి చేయ‌డంలో ఆయ‌న‌కున్న అనుభ‌వం, నేర్ప‌రిత‌నం మ‌రే నాయ‌కుడికి లేవంటే న‌మ్మండి. వంచ‌న, మోసం ఆయ‌న‌కు రెండు క‌ళ్లు. ఊరూరూకో మాట‌, అదే అత‌ని రాజ‌కీయ బాట‌.

మూడు రాజ‌ధానుల‌పై ముఖ్య‌మంత్రికి స‌వాల్ అంటాడు. నువ్వు చేయ‌వ‌య్యా మొగుడా అంటే...అబ్బే అలాంటివి మ‌న ఇంటావంటా లేవంటాడు. మంచైతే మేడిన్ నారా చంద్ర‌బాబు, చెడ్డైతే మేడిన్ వైఎస్ జ‌గ‌న్‌. ఇది ఆయ‌న 40 ఏళ్ల రాజ‌కీయ పాల‌సీ. ఇన్ని సుగుణాలున్న‌ విద్యావేత్త‌, మ‌హా రాజ‌కీయ పండితుడు, జ‌న‌మెరిగిన నేత నారా చంద్ర‌బాబునాయుడు క‌రోనా వేళ‌లో స‌రికొత్త అవ‌తారం ఎత్తాడు.  

ఆన్‌లైన్ మాస్టార్‌గా రోజుమార్చి రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకానికి చైత‌న్య పాఠాలు చెబుతానంటున్నాడు. ప్ర‌తిరోజూ సాయంత్రం ఐదు గంట‌ల‌కు క్లాస్‌లు ప్రారంభం. ఇప్ప‌టికే రెండు క్లాస్‌లు ముగిశాయి. ఆల‌స్యం అమృతం విషం అంటారు. కావున త్వ‌ర‌ప‌డండి. నారా వారి వెబ్‌సైట్‌లో మీ పేరును రిజిస్ట్రేష‌న్ చేసుకోండి. ఆన్‌లైన్ పాఠాలు చెప్పినందుకు ఫీజు ఎంత అని అంటారా...అమూల్యం. 

విజయవాడ వీధుల్లో తొడ కొట్టాను

ఇలా చేస్తే కరోనా రాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?