Advertisement

Advertisement


Home > Politics - Political News

అవును జాతీయ మీడియాని మేనేజ్ చేస్తున్నాం.

అవును జాతీయ మీడియాని మేనేజ్ చేస్తున్నాం.

చంద్రబాబు చలో ఆత్మకూరు కార్యక్రమం సమయంలో ఏదో కొంపలంటుకు పోతున్నట్టు, ఏపీ తగలబడిపోతున్నట్టు నానా రాద్ధాంతం చేసింది జాతీయ మీడియా. ఆ తర్వాత కూడా చంద్రబాబుని హైలెట్ చేస్తూ, జగన్ ను డీగ్రేడ్ చేస్తూ కొన్ని కథనాలను, కొన్ని నేషనల్ ఛానెళ్లు వండి వార్చాయి. వాటిని ఉటంకిస్తూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా టీమ్ రెచ్చిపోయింది కూడా. దాని వెనకున్న బాబు మీడియా మేనేజ్ మెంట్ గురించి అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. తాజాగా ఆ గుసగుసలన్నీ నిజమేనని పరోక్షంగా ఒప్పుకున్నారు చంద్రబాబు.

పోలవరం రివర్స్ టెండర్లపై నోరు పారేసుకోడానికి ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు, జగన్ రాష్ట్ర మీడియా గొంతు నొక్కేస్తున్నారని ఆ రెండు ఛానెళ్లను వెనకేసుకొచ్చారు. అందుకే తాము నేషనల్ మీడియాను నమ్ముకున్నామని, ప్రతి విషయాన్ని వాళ్లకు అప్ డేట్ ఇస్తున్నామని అన్నారు. అంటే దీనర్థం, చంద్రబాబు జాతీయ మీడియాతో కుమ్మక్కయ్యారనే. అయితే జగన్ కు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్న జాతీయ మీడియా గురివింద గింజ వ్యవహారం అందరికీ తెలిసిందే.

ఆమధ్య దక్షిణాది రాష్ట్రాలు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. నేషనల్ మీడియాకు చీమకుట్టినట్టైనా లేదు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హ్యాష్ ట్యాగ్ లతో హోరెత్తే సరికి దిద్దుబాటు చర్యలు చేపట్టి, చెన్నై విలయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. నిజానికి జాతీయ మీడియా కేవలం ఉత్తరాది మీడియా మాత్రమే. ఢిల్లీలో చీమ చిటుక్కుమన్నా వార్తే, దక్షిణాదిలో ప్రళయం వచ్చినా దానికి కనపడదు. అలాంటిది ఒక తెలుగు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న పెయిడ్ ధర్నాలు, పెయిడ్ ఆర్టిస్ట్ ల నిరసనలను కవర్ చేశారు అంటే ఎలాంటి మేనేజ్ మెంట్ జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చంద్రబాబు కూడా తన ప్రసంగాల్లో నేషనల్ మీడియాని ఆకాశానికెత్తేశారంటే రహస్య ఒప్పందం జరిగిందనేది వాస్తవం అని ఒప్పుకున్నట్టే.  రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు చెబితే అది జగన్ మీడియా.. పుకార్లు ప్రచారం చేస్తే అది జాతీయ మీడియా అన్నట్టు ఈ వ్యవహారం మారిపోయింది.

సినిమా రివ్యూ: బందోబస్త్‌        సినిమా రివ్యూ: వాల్మీకి  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?