cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు స్థాయి నిరసన ఇది!

చంద్రబాబు స్థాయి నిరసన ఇది!

ఏదిచేసినా చంద్రబాబు నాయుడు స్థాయే వేరు! ఒకవైపు కట్టుబట్టలతో నిలిపారు అంటూ.. ప్రత్యేక విమానాలకు తగ్గకుండా విదేశీ పర్యటనలు చేసినా... ఒక్కరోజు నిరాహార దీక్షకు ఇరవై కోట్ల రూపాయల మొత్తాన్ని ఏపీ ఖజానా నుంచి ఖర్చు పెట్టించినా.. అది చంద్రబాబుకే సాధ్యం అవుతూ వస్తోంది. ఈ పరంపరలో ఈ రోజు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద చంద్రబాబు నిరసన దీక్ష కూడా కోట్ల రూపాయల ఖర్చు వ్యవహారంగా మారుతూ ఉంది.

ఈ దీక్ష కోసం ఏపీ ఖజానా నుంచి చంద్రబాబు ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం అక్షరాలా పదికోట్ల రూపాయలు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి వీఐపీ ట్రీట్ మెంట్ దక్కుతోంది. ఇందులో పాల్గొనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు విమాన ప్రయాణాల ఖర్చు.. అక్కడ స్టార్ హోటళ్లలో బసకూ ఏపీ ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంటోంది.

ఇక ప్రత్యేకహోదా విషయంలో బాబుగారు ఎన్ని డబుల్ టోన్లతో మాట్లాడినా.. ఎన్నిమాటలు మార్చినా.. ఇంకా ఆయనే నమ్ముతున్న కొంతమంది ‘తటస్థ’ హోదా ఉద్యమకారులకూ వీఐపీ ట్రీట్ మెంటే. ఇలా ఒక రేంజ్లో విలాసంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు.

ఇక అక్కడకు వెళ్లి చేసేవి మళ్లీ రాజకీయ విమర్శలే. ఎన్నికల ప్రచారమే! నిన్న ప్రెస్ నోట్ విడుదల చేసి మోడీని ఎలా విమర్శించారో.. తాము మాట మార్చిన వైనాలను ఎలా దాచేశారో.. ఢిల్లీలోనూ అదేతంతు! దానికోసం ప్రజల సొమ్ము హారతి కర్పూరం అంతే!