cloudfront

Advertisement


Home > Politics - Political News

బాబు.. మోడీ.. జాయింటుగా చేసింది మాత్రం ఇదే!

బాబు.. మోడీ.. జాయింటుగా చేసింది మాత్రం ఇదే!

‘నువ్వు మాట మార్చావు..’ ‘నువ్వు చొక్కాలు మార్చావ్..’ ‘నువ్వు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచావ్..’ ‘నువ్వు అద్వానీకి వెన్నుపోటు పొడిచావ్’ ‘నువ్వు నీ కొడుకును మంత్రిని చేశావ్..’ ‘నువ్వు నీ పెళ్లాని వదిలేశావ్..’ ఇవీ గౌరవనీయమైన ప్రధానమంత్రి.. ఆయనకన్నా సీనియర్ ను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు!

గత ఎన్నికల ముందు ఒకరిని ఒకరు పొగుడుకోవడానికి పోటీలుపడ్డ ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు ఒకరిని ఒకరు ఇలా తిట్టుకుంటున్నారు. ఒకరి వ్యక్తిత్వం గలీజు అని మరొకరు చెబుతున్నారు. ఈ విషయంలో పెళ్లాలను కూడా లాగి మరీ తిట్టుకోవడానికి వీరిద్దరూ ఏమాత్రం వెనుకాడకపోవడం వీరి తత్వాన్ని చాటుతోంది.

లోకేష్ పేరు ఎత్తే సరికే చంద్రబాబుకు చాలా కోపమే పొడుచుకువచ్చినట్టుగా ఉంది. అయితే.. లోకేష్ మంత్రి, అనేక అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని స్పష్టం అవుతూనే ఉంది. ప్రజల నుంచి ఎన్నిక కాకపోయినా లోకేష్ ను మంత్రిగా చేసుకున్నారు చంద్రబాబు. అలాంటప్పుడు లోకేష్ పై రాజకీయ విమర్శలు రావడం సహజమే. అంతమాత్రానికే చంద్రబాబు నాయుడు తీవ్రంగా రెచ్చిపోవడం విశేషం. మోడీ భార్యను రాజకీయంలోకి లాగారు చంద్రబాబు. ఇది ఒకరకంగా విచక్షణ కోల్పోవడమే.

బాబు, మోడీలు ఒకరినొకరు తిట్టుకుంటున్న తిట్ల సంగతెలా ఉన్నా.. వీళ్లిద్దరూ జాయింటుగా మాత్రం ఒక పనిచేశారు. అదే రాష్ట్రానికి మోసం చేయడం. ఎన్నికల ముందేమో.. తమకు అధికారం ఇస్తేచాలు.. ప్రత్యేకహోదా అని ప్రకటించిన వీళ్లు.. నాలుగున్నరేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని.. రాష్ట్రానికి పంగనామాలు పెట్టారు.

హోదా ఇవ్వమని మోడీ మోసంచేస్తే.. అప్పుడంతా హోదా వద్దని.. హోదాకు మించి సాధించామని చంద్రబాబు నాయుడు మోసంచేశారు. ఇప్పుడు ఒకర్నొకరు నిందించుకుంటూ.. నీ కథ అయిపోయిందంటే, నీ కథ అయిపోయిందని అనుకుంటున్న ఈ ఇద్దరి నేతల కథా ఏపీ వరకూ అయిపోయిందని మాత్రం చెప్పొచ్చని పరిశీలకులు అంటున్నారు.