cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎన్టీఆర్ ను రోజూ హత్తుకుంటున్నాడు...

ఎన్టీఆర్ ను రోజూ హత్తుకుంటున్నాడు...

ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న చంద్రబాబుకు, అప్పుడప్పుడు ఆ మహానుభావుడు గుర్తొస్తుంటాడు. అది ఎప్పుడనేది చాలామందికి తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా మహానాడు టైమ్ లో బాబుకు ఎన్టీఆర్ గుర్తొస్తారు. దీంతోపాటు ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకురావడంలో ఆశ్చర్యంలేదు.

మొన్నటివరకు ఎన్టీఆర్ అంటే ఎవరు అనే విధంగా వ్యవహరించిన బాబు, ఎన్టీఆర్ కు రాజకీయాల్లో ఓనమాలు కూడా రాకపోతే తనే దగ్గరుండి నడిపించానని నిస్సిగ్గుగా చెప్పుకున్న బాబు.. ఇప్పుడు ఎన్నికల వేళ పూర్తిగా ఎన్టీఆర్ నామస్మరణతో మునిగిపోయారు. తన సోషల్ మీడియా వేదికలపై ఎన్టీఆర్ ను స్మరించడానికే ఇష్టపడని చంద్రబాబు, ఇప్పుడు రోజుకొకసారైనా ఆయన్ను తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఎంతసేపు తన సొంత డబ్బా కొట్టుకోవడానికి, కొడుకు లోకేష్ ను తిరుగులేని నాయకుడిగా చిత్రీకరించడానికి మాత్రమే మొన్నటివరకు సోషల్ మీడియాను వాడారు చంద్రబాబు. కానీ ఇప్పుడు తనకంటే, తన సుపుత్రుడు కంటే ఎన్టీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.

టీడీపీకి చెందిన అధికారిక ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలతో పాటు అనుబంధ పేజీల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్టీఆర్-చంద్రబాబు కాంబినేషన్ లో ఉన్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. నటసార్వభౌముడ్ని కీర్తిస్తూ ట్వీట్లు కనిపిస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో లేనిది ఇప్పుడే ఎందుకీ కీర్తనలు అంటే దానికి సమాధానం సింపుల్. ఇది ఎన్నికల సీజన్.

అయితే ఎన్టీఆర్ స్మరణలో కూడా తన మార్క్ వీడలేదు చంద్రబాబు. ఎన్టీఆర్ కు సంబంధించిన ఎలాంటి స్టిల్ వచ్చినా అందులో బాబు కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ ను బాబు దగ్గరుండి నడిపించారంటూ పరోక్షంగా చెప్పుకోవడం అన్నమాట.

బాబు లేకపోతే ఎన్టీఆర్ లేరు అన్నట్టు కలరింగ్ ఇవ్వడమన్నమాట. ఇలా ఎన్టీఆర్ ను కీర్తిస్తూ మరో 4 నెలలు పోస్టులు పడతాయేమో. ఆ తర్వాత ఎన్టీఆర్ ఎవరని మాత్రం చంద్రబాబును అడగొద్దు ప్లీజ్.