Advertisement

Advertisement


Home > Politics - Political News

మళ్లీ ఢిల్లీకి బాబు.. ఈసారైనా భేటీ కుదురుతుందా?

మళ్లీ ఢిల్లీకి బాబు.. ఈసారైనా భేటీ కుదురుతుందా?

బీజేపీతో పొత్తు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న చంద్రబాబు, ఇప్పుడు మరోసారి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. అయితే ఈసారైనా బాబుకు మోక్షం లభిస్తుందా.. అపాయింట్ మెంట్ దొరుకుందా అనేది ప్రశ్న. కిందటి సారి టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు అదేదో రాష్ట్ర సమస్య అన్నట్టు ఢిల్లీకి బయల్దేరారు బాబు. 

కానీ మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు, అమిత్ షా కూడా దొరకలేదు. కానీ అనుకూల మీడియా మాత్రం ఆ తర్వాత అమిత్ షా, బాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్టు కలరింగ్ ఇచ్చుకుంది. తర్వాత అది కూడా ఫేక్ అని తేలడంతో బాబు, అతడి మీడియా ముఖం చాటేసింది.

ఆ అవమానాల తర్వాత ఇప్పుడు మరోసారి బాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల వేళ బాబు ఢిల్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని చెప్పడం బాబు ఉద్దేశ్యం. కానీ తెరవెనక లక్ష్యం మాత్రం వేరు. ఎలాగైనా బీజేపీతో మరోసారి కాపురం మొదలుపెట్టాలి. కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆ మేరకు హామీ పొందాలి. అదే బాబు అంతిమ లక్ష్యం.

పొత్తు సంగతి తర్వాత.. పరువు ఉంటుందా?

బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతుంటే.. ఇటు వైసీపీ జనాలు మాత్రం బాబుపై మరోసారి సెటైర్లు పేలుస్తున్నారు. పొత్తు సంగతి పక్కనపెట్టి, కనీసం ఈసారి అపాయింట్ మెంట్ అయినా దక్కితే బాబు 40 ఏళ్ల పరువు నిలబడుతుందని, లేదంటే మరోసారి తలదించుకొని రాష్ట్రానికి రావాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

వైసీపీ జనాలు చేస్తున్న విమర్శల భయం చంద్రబాబులో కూడా ఉంది. మరోసారి ఢిల్లీ వరకు వెళ్లి అవమానం పొందాలని ఆయనకు లేదు. అందుకే బీజేపీలో ఉన్న తన జనాల్ని ఈసారి ఫుల్ అలెర్ట్ చేశారు. ఎలాగైనా మోదీ అపాయింట్ మెంట్ పట్టాలని ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల టైమ్ లో మోదీ, అమిత్ షాలకు కాస్త ఖాళీ సమయం దొరుకుతుంది. ఆ టైమ్ లో బాబును ఎలాగోలా మోదీ ఛాంబర్ లోకి తోసేయాలని చూస్తున్నారు బీజేపీలో ఉన్న టీడీపీ జనాలు.

రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలం

మొన్నటివరకు ఏపీలో రాష్ట్ర బీజేపీకి, టీడీపీకి మధ్య అస్సలు పడేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు కనిపిస్తోంది. సోము వీర్రాజు టీడీపీని పక్కనపెట్టారు. పూర్తిగా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే లాజిక్ ప్రకారం, బీజేపీని కలిపేసుకోవడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నారు బాబు. అందుకే పార్లమెంట్ సమావేశాల్ని వేదికగా ఎంచుకున్నారు. ఎలాగూ మీడియా ఎటెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి, బాబు 'బ్రీఫ్' చేసుకోవడానికి బాగుంటుంది.

ప్రస్తుతానికైతే అపాయింట్ మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ-బాబును కలిపేందుకు ఢిల్లీలో ఉన్న టీడీపీ జనాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో తనను వ్యక్తిగతంగా దూషించిన చంద్రబాబుకు, మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా అనేది పెద్ద డౌట్. ఒకవేళ అపాయింట్ మెంట్ దొరక్కపోతే ఎలాంటి కథనాలు వండివార్చాలనే అంశంపై ఎల్లోమీడియా ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?