cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఇంకా ఈ ఆరాటం దేనికోసం చంద్రబాబూ..?

ఇంకా ఈ ఆరాటం దేనికోసం చంద్రబాబూ..?

రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతోందనే సంకేతాలు బలంగానే ఉన్నాయి. ఆ మేరకు చంద్రబాబు, మాటలు చేతలు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. అటు జగన్ కూడా గెలుపుపై ధీమాతో సైలెంట్ గానే ఉన్నారు. రాగాపోగా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ ఈవీఎంలపై గొంతెత్తి అరుస్తున్నారు. పైగా ఇప్పుడు ఇతర జాతీయ పార్టీల కోసం బాబు ఎన్నికలు జరగబోతున్న పలు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తారట. ఈమేరకు షెడ్యూల్ కూడా ఖరారైనట్టు సమాచారం.

అసలింతకీ చంద్రబాబుకీ ఆయా రాష్ట్రాల ఎన్నికలకీ ఏంటి సంబంధం. బాబుకి అవసరం ఉంది కాబట్టి.. ఓ మైనార్టీని, ఓ బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను, మరో స్టేట్ సీఎంను పిలిపించుకుని రాష్ట్రంలో ప్రచారం చేయించుకున్నారు. మరి ఇతర రాష్ట్రాల నేతలకు చంద్రబాబు అవసరం ఏముంటుంది. బాబు చెబితే అక్కడ మహా కూటమికి ఓట్లు వేసే అమాయకులు ఎవరున్నారు. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు తన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ చేయాలనుకుంటున్నారు.

అవసరం ఆయా నేతలది కాదు, చంద్రబాబుదే. ఎలాగూ రాష్ట్రంలో ఓడిపోతున్నాం కాబట్టి, జాతీయ స్థాయిలో కాస్త మీడియాలో కనపడి పాపులర్ నేతగా పేరు తెచ్చుకుని టైమ్ బాగుండి బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో గద్దెనెక్కితే చక్రం తిప్పాలని బాబు ఆలోచన. దానికి అనుగుణంగానే కూటమి లోని నేతలందరితో కలివిడిగా ఉంటున్నారు. తన రాష్ట్ర ఎన్నికలు అయిపోయినా కూడా బిజీబీజీగా ఢిల్లీలోనే మకాం వేసి జాతీయ రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు.

ప్రత్యేకహోదా విషయంలో సింపతీ కోసం బీజేపీని, ప్రధాని మోడీని తిట్టడం మొదలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రస్థాయిలో ఆ తిట్లనే కంటిన్యూ చేయబోతున్నారు. మా రాష్ట్రానికి అన్యాయం చేశాడని అక్కడ కూడా మోడీని తిడుతూ కాలక్షేపం చేస్తారన్నమాట. పనిలో పనిగా జాతీయ నేతలతో కలసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారన్నమాట. అలా తన అహాన్ని తృప్తి పరుచుకొని.. రాష్ట్రంలో పరాభవం ఎదురైనా, కేంద్రంలో ఎవరో ఒకరి పంచన చేరి పబ్బం గడుపుకోవాలనేది బాబుగారి మాస్టర్ ప్లాన్.

అయితే బాబు ఉత్సాహపడుతున్నా.. ఆయా రాష్ట్రాల నేతలు మాత్రం తమకు మద్దతుగా చంద్రబాబుని ప్రచారానికి రావొద్దనే నచ్చజెబుతున్నారట. అయినా కూడా అయ్యగారు ఊరుకుంటారా.. అనుకూల మీడియాతో తనకి అనుకూలంగా ప్రచారం చేసుకుంటూ.. పక్క రాష్ట్రాల్లో మీటింగ్ లకు హాజరు కాబోతున్నారు. 

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!