cloudfront

Advertisement


Home > Politics - Political News

అక్కడ కూడా సొంత డబ్బా ఏంటి బాబూ..!

అక్కడ కూడా సొంత డబ్బా ఏంటి బాబూ..!

అమరావతిని భ్రమరావతిగా మార్చి ఐదేళ్లుగా పలుగు, పారలతో కాలక్షేపం చేసిన చంద్రబాబు.. ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధాని నిర్మాణం మాత్రం పూర్తి చేస్తారట. అసలు రేపు అధికారంలోకి వస్తే కదా ఈయన రాజధాని కట్టడానికి, అమరావతికి ఇటుకలెత్తడానికి. ఈ సంగతి ఎక్కడ చెప్పారో తెలుసా? కర్నాటక ఎన్నికల ప్రచారంలో. అసలు కర్నాటకకు, అమరావతికి సంబంధం ఏంటి?

తిడితే అక్కడ మోడీని తిట్టి నాలుగు ఓట్లు తన మిత్రపక్షాలకు పడేలా చేయాలి, లేకపోతే కూటమి స్నేహితులు కాంగ్రెస్, జేడీఎస్ ని పొగడాలి. కానీ అక్కడ కూడా బాబు తన సొంత డబ్బా బైటకు తీశారు. అమరావతిని ఆపేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలు సాగనివ్వబోనని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మించి తీరుతానంటూ కర్నాటక శ్రీరామ్ నగర్ ఎన్నికల ప్రచార సభలో నొక్కి వక్కాణించారు.

అసలు అమరావతి గురించి చంద్రబాబు ఎందుకు దిగులుపడుతున్నారు. తాను అధికారంలోకి వచ్చినా అమరావతే రాజధాని అని ఇప్పటికే జగన్ ప్రకటించారు కదా. అధికార మార్పిడి జరిగితే సంతోషంగా సీఎం కుర్చీ జగన్ కి అప్పగించాలి కానీ అమరావతిపై బాబుకి లేనిపోని అపోహలెందుకని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అయితే అయ్యగారి బాధ అంతా అమరావతి గురించి కాదు, దాని పేరుతో స్వాహా చేసిన నిధుల గురించి.

జగన్ అధికారంలోకి వస్తే బాబు అక్రమాలన్నీ ఒక్కొక్కటే బైటకొస్తాయి. అమరావతి ఇటుకల కోసం సేకరించిన విరాళాల దగ్గర నుంచి, కేంద్రం ఇచ్చిన నిధుల వరకు అన్నీ లెక్కలు తీయాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబు బండారం బైటపడక మానదు. అందుకే అయ్యగారు తానే అధికారంలోకి రావాలని, అమరావతి కట్టిన పేరు ప్రఖ్యాతులు తనకే దక్కాలని దురాశపడుతున్నారు.

అంత జాగ్రత్త ఉన్న మారాజైతే.. ఐదేళ్లలో రాజధాని నిర్మించొచ్చు కదా అని నెటిజన్లు బాబుపై మండిపడుతున్నారు. బాబుగారి భ్రమరావతి భ్రమలు ఇంకా వీడినట్టు లేవని కౌంటర్లిస్తున్నారు.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?