cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలుగు ఆడపడుచుని ఓడించాలని బాబు కన్నడ ప్రచారం!

తెలుగు ఆడపడుచుని ఓడించాలని బాబు కన్నడ ప్రచారం!

అంతేకాదు.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మండ్యకు ప్రచారానికి వెళ్లారు. అక్కడ దేవేగౌడ మనవడు నిఖిల్ గౌడను గెలిపించాలని చంద్రబాబు నాయుడు అంటున్నారు. నిఖిల్ గౌడను గెలిపించమని అంటుంటే అదోలెక్క కానీ, అక్కడ ఒక తెలుగింటి ఆడపడుచును ఓడించమని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారు.

మండ్య నుంచి నటి సుమలత పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగునాట పుట్టి.. దక్షిణాదిన అంతా హీరోయిన్ గా వెలిగిన నటి ఆమె. తన ప్రతిభతో తెలుగుతో పాటు మలయాళీ, కన్నడ భాషల్లో కూడా సుమలత మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిలయ్యారు.

ఒకవైపు దేవేగౌడను ఏపీ ప్రచారానికి తీసుకువచ్చి చంద్రబాబు నాయుడు ఏపీ జనాలను వెక్కిరించారు. దేవేగౌడ హయాంలో కర్ణాటక వైపు నుంచి ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగింది. అలమట్టి డ్యామ్ ఎత్తును పెంచుతూ పోయారప్పుడు. ఏపీకి తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు నాయుడు చేతగాని వ్యక్తిలా ఉండిపోయారప్పుడు. ఏమైనా అంటే.. ప్రధానమంత్రులను డిసైడ్ చేసినట్టుగా, ఫోన్లతో రాష్ట్రపతులను 
నియమించినట్టుగా చెప్పుకునే బాబు.. అలమట్టి విషయంలో ఏపీకి అంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక అసమర్థుడిలా మిగిలారు. చంద్రబాబు నాయుడి సమర్థత అలానే ఉంటుంది. అది చాలదన్నట్టుగా దేవేగౌడను తెచ్చి ఏపీలో ప్రచారం చేయించారు చంద్రబాబు నాయుడు.

ఇటీవలే అంబరీష్ మరణించడంతో సుమలత రాజకీయంలోకి దిగారు. తన భర్తకు మంచి పట్టుండిన మండ్య ప్రాంతంలో పోటీచేస్తూ ఉన్నారు. సుమలతకు అన్నివర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతూ ఉంది. బీజేపీ వాళ్లు, మండ్య ప్రాంత కాంగ్రెస్ వాళ్లు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక తెలుగు వాళ్లంతా సుమలత నెగ్గాలనే కోరుకుంటూ ఉన్నారు. ఆమె తెలుగింటి ఆడపడుచు కావడం ఒక రీజన్ అయితే.. జాక్ పాట్ సీఎం కుమారస్వామి తన వారసుడిని అక్కడ పోటీకి పెట్టడం మరో రీజన్.

దేవేగౌడ కుటుంబంలో అందరికీ పదవులు కావాలా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ఇలాంటి పరిస్థితిని కూడా అర్థం చేసుకోండా చంద్రబాబు నాయుడు సుమలతకు వ్యతిరేకంగా, దేవేగౌడ మనవడిని గెలపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. అయినా అక్కడ బాబు ప్రచారానికి ఓట్లు పడతాయా? మండ్య ప్రాంతంలో తెలుగువాళ్లు కూడా పెద్దగా ఉండరు. అది ప్యూర్ కర్ణాటక. అలాంటి చోటకు చంద్రబాబును తీసుకెళ్లి ప్రచారం చేయించుకోవడం జేడీఎస్ వాళ్ల దివాళాకోరుతనం అనాలేమో!

జనసేనకు పడ్డ ఓట్లలో 80 టీడీపీ, 20 వైసీపీ ఓట్లని అంచనా!