Advertisement

Advertisement


Home > Politics - Political News

బాబు..పవన్ లకు కలిపే పంచ్ పడిందలా?

బాబు..పవన్ లకు కలిపే పంచ్ పడిందలా?

చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ సినిమా హీరో కమ్  పొలిటీషియన్. ఈ ఇద్దరూ విపక్షంలో ఉంటూ వైసీపీ మీద శక్తి కొలదీ  రాళ్ళేస్తున్నారు. గతంలో జంటగా ఉన్నా ఇపుడు విడిగా కనిపిస్తున్నా కూడా ఈ ఇద్దరినీ కలిపే వైసీపీ ఎపుడూ కామెంట్స్ చేస్తుంది.

ఇక మంత్రి అవంతి శ్రీనివాసరావు అయితే అటు బాబునూ ఇటు పవన్ ని అసలు వదలడంలేదు. పవన్ మంచి సినిమా నటుడు. అయితే ఆయన సినిమాల్లోనే హీరో. కానీ రాజకీయాల్లో మాత్రం కాదంటూ మంత్రి గారు వదిలిన పంచ్ ఇపుడు వైరల్ గా మారింది.

చంద్రబాబు రాజకీయ స్వార్ధం ఇలా ఉంటుంది అంటూ బాబు గారి మీద కూడా మంత్రి సెటైర్లు బాగానే పేల్చారు. విశాఖలో రాజకీయం చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు, పంచాయతీ సర్పంచులూ  అందరూ బాబు పార్టీకి కావాలి. 

కానీ విశాఖను రాజధాని నగరంగా చేస్తామంటే మాత్రం బాబు  అడ్డం పడిపోతారు. అంటే చంద్రబాబుకు రాజకీయమే తప్ప విశాఖ బాగోగులు అసలు అవసరం లేదని మంత్రి అన్న మాటలు తమ్ముళ్ళకు జీవీఎంసీ ఎన్నికల వేళ బాగానే గుచ్చుకుంటున్నాయి.

లోకేష్‌కు  పిచ్చి పీక్స్‌కు చేరిపోయింది

నారావారి కుటుంబంలో మాన‌సిన స‌మ‌స్య ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?