cloudfront

Advertisement


Home > Politics - Political News

విలాస జీవితంలో చంద్రబాబుకు పోటీనే లేదు!

విలాస జీవితంలో చంద్రబాబుకు పోటీనే లేదు!

తన చేతికి వాచ్ లేదు, తనంతడి బీదవాడు ఈ ప్రపంచంలో లేడు... తన వేలికి ఉంగరం పెట్టుకోను.. అని ఒకటికి కోటి సార్లు చెప్పుకునే చంద్రబాబునాయుడు గారి విలాసం కథ ఇది. బాబుగారు ప్రతి నిమిషాన్నీ అత్యంత విలాసంగానే బతుకుతాడు తప్ప, ఎక్కడా ఆయన మాటల్లో చెప్పేదినిజం కాదు అని అర్థంచేసుకోవడానికి ఇదే రుజువు. ఈ విలాసం చంద్రబాబు నాయుడు తన ఇంట్లో సొమ్ముతోనో.. హెరిటేజ్ లాభాలతోనో.. తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ తోనో చేసుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ.. ప్రజల సొమ్ముతో చంద్రబాబు నాయుడు పండగ చేసుకొంటూ ఉండటం, అసలు కనీవినీ ఎరగని రీతిలో.. దేశంలో మరే ముఖ్యమంత్రి ఖర్చు పెట్టని స్థాయిలో చంద్రబాబు నాయుడు తన రోజువారి ఖర్చులను పెడుతూ ఉండటం మాత్రం క్షమించరాని అంశం.

చంద్రబాబు నాయుడు విలాసం ఏపీలో వెలుగులో రావడం కాదు, ఈ వ్యవహారం కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో కన్నడ వార్తలను ఇంగ్లిష్ లో ఇచ్చే ఒక పత్రిక బయట పెట్టింది. ఈ మధ్యనే శ్రీమాన్ చంద్రబాబు నాయడు వేసిన బెంగళూరు టూరు ఖర్చు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా బయటకు వచ్చిన విషయం ఇది.

ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశాడు కదా, ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు చీఫ్ గెస్టు అనే విషయం అందరికీ తెలిసిందే. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి అయిన ఖర్చు గురించి కర్ణాటకలో సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను అడిగారు. దీంతో బాబుగారి విలాసం బయటకు వచ్చింది. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు నాయుడు హోటల్ బిల్లు కింద ఏకంగా 8.7 లక్షల రూపాయలను చెల్లించిందట కర్ణాటక ప్రభుత్వం.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన వారందరిలో కెళ్లా అత్యధిక బిల్లు చంద్రబాబు నాయుడు బసకు చెల్లించినదే. ఆ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి.. వీళ్లంతా హాజరయ్యారు. అయితే వారెవరి హోటల్ బిల్లూ చంద్రబాబు నాయుడు స్థాయిలో లేదు. అసలు ఈ విలాసం విషయంలో చంద్రబాబుకు పోటీనే లేదు.

అఖిలేష్ యాదవ్ హోటల్ బిల్లు లక్ష రూపాయల చిల్లర, మాయవతి బిల్లు లక్షా నలభై వేల రూపాయలు, పినరాయి విజయన్ హోటల్ బిల్లు లక్ష...ఇలా వీళ్ల అతిథి సత్కారాల కోసం కర్ణాటక గవర్నమెంటు ఖర్చు చేసింది. వీరిలో టాప్ మాత్రం చంద్రబాబు నాయుడే. ఈయన 18 గంటల సేపట్లో కర్ణాటక ప్రభుత్వం చేత 8.7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఇదీ చంద్రబాబు నాయుడు విలాసం.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు 18 వేల రూపాయలు అని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఖర్చు గంటకు వెయ్యి రూపాయలు అనుకుంటే.. చంద్రబాబు ఖర్చు గంటకు యాభై వేల రూపాయలు. ఇదీ చేతికి వాచి కూడాపెట్టుకోని.. అత్యంత సామాన్య జీవితాన్ని ఈడుస్తున్న చంద్రబాబు గారి స్థాయి.