Advertisement

Advertisement


Home > Politics - Political News

ఏపీలో ఫ్రెంచ్ విప్లవం.. భ్రమల్లో బాలయ్య

ఏపీలో ఫ్రెంచ్ విప్లవం.. భ్రమల్లో బాలయ్య

"అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోంది.." సింహా సినిమాలో బాలకృష్ణ ఫేమస్ డైలాగ్ ఇది. ఆ సినిమాలో పోలీసులకి అప్పుడైనా నోరు లేచింది, మరి బాలయ్యకి మాత్రం ఎప్పుడూ నోరు లేవదు. ఒకవేళ లేచినా హే బుల్ బుల్, దబిడి దిబిడి అంటూ నాలుక అడ్డం పడుతుంది. అలా ఎప్పుడూ  లేవని బాలయ్య నోరు ఇప్పుడు తానున్నానంటూ వానపాము బుసకొట్టినట్టు కొట్టింది.

వైసీపీని అధికారం నుంచి దింపేదాకా నిద్రపోనని బీరాలు పలికారు బాలయ్య. "బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు కదా.. నేను చెబుతున్నా ఇది జరిగి తీరుతుంద"ని చెప్పుకొచ్చారు. అక్కడ బాలవాక్కు అంటే చిన్న పిల్లల వాక్కు అని అర్థం.. ఇక్క బాలయ్య మాత్రం తన పేరులో 'బాల' అనే పదం ఉందని తాను చెప్పిందల్లా బాలవాక్కు అనుకుంటున్నారు. అదే ఇక్కడ పెద్ద కామెడీ.

కార్యకర్తలకు ఇక నుంచి తను అండగా నిలబడతానన్నారు బాలయ్య. అంటే ఇప్పటివరకూ ఆయన కార్యకర్తల్ని గాలికొదిలేశారనేకదా అర్థం. ఆ నిజం కూడా పరోక్షంగా ఒప్పుకున్న బాలయ్య.. ఇకపై ఎక్కడ అన్యాయం జరిగితే తానక్కడ రంగంలోకి దిగుతానంటూ ప్రగల్భాలు పలికారు.

ఈ కామెడీ అక్కడితో ఆగలేదు. వైసీపీ ఏడాది పాలనలోనే ఏపీ వెనక్కి వెళ్లిపోయిందని, తిట్టడమే వైసీపీవాళ్ల పని అని, అభివృద్ధి అంతా తమ హయాంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎక్కువకాలం నిలవదని, ఫ్రెంచ్ విప్లవంలో జరిగినట్టు ప్రజలంతా రాజభవనంలోకి వెళ్లి మహారాజుని బైటకు లాక్కొచ్చినట్టు ఏపీలో కూడా జరుగుతుందని శాపనార్థాలు పెట్టారు. అసలు ఫ్రెంచ్ విప్లవానికీ, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకీ సంబంధం ఏంటి? ప్రజలు రాజుని బైటకు లాక్కొని రావడం ఏంటి?

నవరత్నాల పథకాలతో ఏపీ సుభిక్షంగా ఉన్న వేళ, రాజన్న రాజ్యం మళ్లీ జగనన్న పాలనలో వచ్చిందని సంబరపడుతున్న వేళ, అసంతృప్తి ఎక్కడిది, ఎందుకొస్తుంది? ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి, అవినీతి ముసుగేసి, నవ్యాంధ్రను నాశనం చేసిన టీడీపీ ప్రభుత్వం గురించి బాలయ్య గొప్పలు చెప్పడమేంటి, వైసీపీ పాలనపై సవాళ్లు విసరడం ఏంటి?

చాలా సీరియస్ గా మాట్లాడుతూనే, తనకు తెలియకుండానే కామెడీ పండించారు బాలకృష్ణ. ఫ్రెంచ్ విప్లవం అన్నారంటేనే బాలయ్య భ్రమలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ బాబే అనుకుంటే ఇప్పుడు బాలయ్య కూడా తయారయ్యాడన్నమాట.

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?