cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

సిగ్గ‌నిపించ‌లేదా భాను?

సిగ్గ‌నిపించ‌లేదా భాను?

క‌నీసం త‌న మాట‌లు వింటే జ‌నం న‌వ్విపోతార‌నే స్పృహ కూడా బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి భానుప్ర‌కాశ్‌రెడ్డికి లేన‌ట్టుంది. జ‌నానికి ఏమీ తెలియ‌ద‌నుకుని ఆయ‌న ఏవేవో మాట్లాడుతున్నారు. పైగా టీటీడీ ప్ర‌ధాన అర్చ‌కులు ర‌మ‌ణ‌దీక్షితుల‌కు భానుప్ర‌కాశ్‌రెడ్డి స‌వాల్ విస‌ర‌డానికి సిగ్గు అనిపించ‌లేదా? అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

టీటీడీ ఉద్యోగుల్లో అన్య‌మతస్తులున్నార‌ని, సాక్ష్యాధారాల‌తో స‌హా తాను నిరూపిస్తాన‌ని, ధైర్యం ఉంటే త‌న స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని ర‌మ‌ణ‌దీక్షితుల‌కు భానుప్ర‌కాశ్‌రెడ్డి తాజాగా స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్‌ను భానుప్ర‌కాశ్‌రెడ్డి కాకుండా మ‌రెవ‌రైనా విసిరి ఉంటే కొంచెమైనా అర్థం ఉండేది. 

కానీ టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వంలో దేవాదాయ‌శాఖ మంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాలరావు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. క‌రోనాతో ఆయ‌న మృతి చెందిన విష‌యం తెలిసిందే.

మ‌రో ముఖ్య‌మైన సంగ‌తి ఏంటంటే స‌వాల్ విసురుతున్న భానుప్ర‌కాశ్‌రెడ్డి గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో టీటీడీ బోర్డు స‌భ్యుడు. మ‌రి టీటీడీలో అన్య‌మ‌త‌స్తులు ఉంటే, అలాంటి వారిని ఎందుకు తీసేయ‌లేదో చెప్పాల్సిన బాధ్య‌త ఉంది. తాము త‌ప్ప అంద‌రూ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌నే రీతిలో భానుప్ర‌కాశ్‌రెడ్డి మాట‌లున్నాయ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

త‌మ హ‌యాంలో అన్య‌మ‌త‌స్తుల‌ను తొల‌గించి ఉంటే, ఈ రోజు ఆ ప్ర‌శ్నే ఉత్ప‌న్న‌మ‌య్యే అవ‌కాశ‌మే లేదు క‌దా? ఎదుటి వాళ్ల‌ను ప్ర‌శ్నించే ముందు, త‌న‌ను తాను అవే ప్ర‌శ్న‌లు వేసుకుంటే స‌మాధానం దొరుకుతుంద‌ని భానుప్ర‌కాశ్‌రెడ్డి గ్ర‌హిస్తే మంచిద‌ని ప‌లువురు హిత‌వు చెబుతున్నారు.

లోకేష్ సవాల్ చూస్తే.. బ్రహ్మానందం గుర్తొస్తున్నాడు

దేవి సిక్స్ కొడితే...నేను రెండు సిక్సులు కొడ‌తా

 


×