cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మేం విడాకులు తీసుకుంటున్నాం

మేం విడాకులు తీసుకుంటున్నాం

27 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతున్నామ‌ని ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన మైక్రోసాప్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు, బిల్‌మెలిందాగేట్స్ ఫౌండేష‌న్ చైర్మ‌న్ బిల్‌గేట్స్ దంప‌తులు ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. 

ఫౌండేష‌న్‌లో త‌మ భాగ‌స్వామ్యం కొన‌సాగుతుంద‌ని, కానీ దంప‌తులుగా మాత్రం క‌లిసి ఉండ‌లేమ‌ని బిల్‌గేట్స్‌, ఆయ‌న భార్య మెలిందా ఉమ్మ‌డిగా ప్ర‌క‌టించ‌డం యావ‌త్ ప్ర‌పంచాన్ని నివ్వెర‌ప‌రిచింది. ప్రస్తుతం బిల్‌గేట్స్‌ వయసు 65 ఏళ్లు కాగా, మెలిందా వయసు 56 ఏళ్లు. 1994లో వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. ట్విట‌ర్‌లో విడాకుల ప్ర‌క‌ట‌న ఇలా ఉంది.

‘ఎన్నో సమాలోచనలు, ఎంతో మథనం తర్వాత మా వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. గత 27 ఏళ్లలో మేము ముగ్గురు అత్యద్భు తమైన పిల్లలను తీర్చిదిద్దాం. దాంతోపాటు ప్రపంచలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‌లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. 

కానీ భార్యాభర్తలుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత  ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం’  అని ట్విటర్‌లో బిల్‌, మెలిందాలు ప్రకటించ‌డం విశేషం.

2000 సంవత్సరంలో  బిల్‌-మెలిందా గేట్స్‌ ఫౌండేషన్ స్థాపించారు. ఈ ఫౌండేష‌న్ ద్వారా ఇప్పటి వరకూ వారు 53 బిలియన్‌ డాలర్లను ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు బిల్‌గేట్స్ 2020-మార్చి 14న‌ రాజీనామా చేశారు. బోర్డు సలహాదారుడిగా ఉన్న బిల్‌గేట్స్ ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. 2014లో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు. అప్ప‌టి నుంచి పూర్తి సమయం సామాజిక కార్యక్రమాలకు కేటాయించారు.

బిల్‌గేట్స్ భార్య మెలిందా కంప్యూట‌ర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్. అనంత‌రం ఎంబీఏ పూర్తి చేశారు. అనంత‌రం మైక్రోసాప్ట్ సీఈవోగా బ‌ల్‌గేట్స్ ఉన్న‌ప్పుడు మెలిందా ప్రొడక్ట్‌ మేనేజర్‌గా చేరారు. అప్పట్లో కంపెనీలో చేరిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లలో ఏకైక మహిళ మెలిందా. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌కు దారి తీసింది. అనంత‌రం పెళ్లి చేసుకున్నారు.  

ప్ర‌పంచంలోనే సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల్లో మైక్రోసాప్ట్ ఎంత పేరున్న సంస్థో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో వైద్యానికి సంబంధించి విస్తృత‌మైన అవ‌గాహ‌న‌, చైత‌న్య కార్య‌క్ర‌మాలు దంప‌తులిద్ద‌రూ నిర్వ‌హించారు. 

ప్ర‌పంచం లోనే అత్యంత ధనవంతుల్లో బిల్‌గేట్స్‌ ఒకరు. అంతేకాదు, పేద‌ల‌కు, విద్య‌, వైద్యానికి సాయం చేయ‌డంలో దంప‌తులిద్ద‌రూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇప్పుడు వారిద్ద‌రు విడిపోతుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×