Advertisement

Advertisement


Home > Politics - Political News

అయ్య‌య్యో ...జాతీయ పార్టీల డిపాజిట్ గ‌ల్లంతైందే!

అయ్య‌య్యో ...జాతీయ పార్టీల డిపాజిట్ గ‌ల్లంతైందే!

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీల డిపాజిట్ గ‌ల్లంతైంది. పోలైన ఓట్ల‌లో అభ్య‌ర్థికి 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టిస్తుంది. 

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,46,545 ఓట్లు పోల‌య్యాయి. ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల‌కు 24,425 ఓట్లు వ‌స్తే డిపాజిట్ ద‌క్కిన‌ట్టు. తాజాగా బ‌ద్వేల్‌ ఉప ఎన్నిక  ఫ‌లితం వెలువ‌డింది.

అధికార పార్టీ వైసీపీ 90,433 ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. టీడీపీ, జ‌న‌సేన పార్టీలు బ‌రి నుంచి త‌ప్పుకున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి పార్టీల‌య్యాయి. 

బీజేపీకి 21,678 ఓట్లు, కాంగ్రెస్‌కు 6,235 ఓట్లు ద‌క్కాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం 1/6 వంతు ఓట్ల‌ను జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ సాధించ‌లేక‌పోయాయి.

దీంతో కాంగ్రెస్‌, బీజేపీలు డిపాజిట్ కోల్పోయిన‌ట్టైంది. ఇదే విష‌యాన్ని వైసీపీ తాజా ఎమ్మెల్యే డాక్ట‌ర్ దాస‌రి సుధ చెప్పారు. గెలుపొందిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయ‌న్నారు. 

బీజేపీ, టీడీపీ, జనసేన కలిసినా డిపాజిట్లు గల్లంతయ్యాయన్నారు. బద్వేల్ ప్రజలు, సీఎం జగన్‌  వెంటే ఉన్నారని డాక్టర్‌ సుధ అన్నారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని ఆమె అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?