cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీ, టీడీపీ లాలూచీ ఇలా బయటపడుతోంది..!

బీజేపీ, టీడీపీ లాలూచీ ఇలా బయటపడుతోంది..!

పరిషత్ ఎన్నికల్ని బాయ్ కాట్ చేస్తున్నామని టీడీపీ చెబుతున్నా బీజేపీ సపోర్ట్ తో అరాచకాలకు పాల్పడుతోందనే విషయం తాజాగా అర్థమవుతోంది. టీడీపీ తరపున చాలా చోట్ల ఏజెంట్లు కూడా లేకపోవడంతో ఆ పార్టీ సీరియస్ గా ఎన్నికలపై దృష్టిపెట్టలేదనుకున్నారు. 

కానీ నెల్లూరు జిల్లా పొనుగోడులో బ్యాలెట్ బాక్సుల్లో బీజేపీ ఏజెంట్ నీళ్లు పోశాడు. చేజర్లలో ఓ స్వతంత్ర అభ్యర్థి తరపున ఏజెంట్ గా ఉన్న వ్యక్తి వైసీపీ ఏజెంట్లతో గొడవకు దిగాడు. దీని వెనక కూడా టీడీపీ హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఇలా చాలా చోట్ల బీజేపీ వాళ్లని, జనసేన వాళ్లని, స్వతంత్రులను అడ్డు పెట్టుకుని టీడీపీ అరాచకాలకు పాల్పడుతోంది.

వైసీపీ ఆరోపణలు నిజమేనా..? 

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని వైసీపీ మెజార్టీ తగ్గించడానికే ఆ పార్టీలు కష్టపడుతున్నాయనేది వైసీపీ నేతల ఆరోపణ. ముందుగా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ దీన్ని రిహార్సల్స్ గా ఉపయోగించుకున్నాయి. 

ఎన్నికల్లో అరాచకాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగలేదని ఆరోపించడం, వైసీపీ నేతల్ని దోషులుగా చిత్రీకరించడం వారి టార్గెట్. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ఆ టార్గెట్ రీచ్ అవుతారనే అర్థమవుతోంది. పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గుతుందని అంచనా.

స్నేహం ముదురుతోందా..?

తిరుపతి ఉప ఎన్నికలనాటికి బీజేపీ, టీడీపీ స్నేహం ముదురుతుందనడానికి పరిషత్ ఎన్నికలే నిదర్శనం అంటున్నారు. ఓ వైపు అధికార పక్షం అరాచకాలకు పాల్పడుతోందని విమర్శలు చేస్తూనే, మరోవైపు ప్రతిపక్షం తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటే.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్ష తీర్చుకుంటున్నారని కూడా విమర్శిస్తున్నారు.

మొత్తమ్మీద పరిషత్ ఎన్నికల సాక్షిగా.. బీజేపీ, టీడీపీ, జనసేన లాలూచీ బయటపడింది. తిరుపతి ఉప ఎన్నిక నాటికి ఈ 3 పార్టీల తెరవెనక అసలు రంగులు పూర్తిస్థాయిలో బహిర్గతమయ్యే అవకాశం ఉంది. 

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×