cloudfront

Advertisement


Home > Politics - Political News

కర్ణాటకలో కూలిన కాంగ్రెస్ ఆశలు..!

 కర్ణాటకలో కూలిన కాంగ్రెస్ ఆశలు..!

నిన్న మధ్యాహ్నానికి బీజేపీ సంబరాలు చేసుకుంది.. అయితే సాయంత్రానికి కాంగ్రెస్ వాళ్లు ఝలక్ ఇచ్చారు.. ఎలాంటి షరతులూ పెట్టకుండా కుమారస్వామిని సీఎం సీట్లో కూర్చోవడానికి రమ్మన్నారు. కనీసం 20శాతం సీట్లను కూడా సాధించని పార్టీ నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కాంగ్రెస్ సై అంది. బీజేపీ వాళ్లను గద్దెనెక్కనివ్వకపోతే చాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని నడిపించ ప్రయత్నం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన ఝలక్‌లు తగులుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు జంపింగుల జాబితాలోకి చేరిపోయారు. ఒకవైపు ప్రమాణస్వీకారానికి యడ్యూరప్ప రంగంసిద్ధం చేసుకోగా.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు గాయబ్ అనే వార్తలు వస్తున్నాయి. సీఎల్పీ సమావేశానికి కొంతమంది ఎమ్మెల్యేలు మొహం చాటేశారని తెలుస్తోంది. వీరి సంఖ్య ఐదారుగురు వరకూ ఉందని సమాచారం. గాలి జనార్ధన్ రెడ్డి బ్రదర్స్‌కు సన్నిహితులు అయిన హైదరాబాద్ కర్ణాటక ప్రాంత ఎమ్మెల్యేలు జంప్ అని.. వీరు శ్రీరాములుకు టచ్లోకి వెళ్లారని.. వీరిపై కాంగ్రెస్ పార్టీ ఇక ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సమాచారం.

అలాగే జేడీఎస్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో జేడీఎస్ ఆందోళన వ్యక్తంచేస్తోంది తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ఒక్కోరికి వందకోట్ల రూపాయలు ఇచ్చి కొనేసుకుంటోందని జేడీఎస్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో పరిస్థితి వారి చేయి దాటిపోయిందని స్పష్టం అవుతోంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చాలా అవకాశాలే ఉన్నాయి. 

ఒకటి ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవడం.. రెండు వీళ్ల గైర్హాజరీ మార్గం ద్వారా కూడా బీజేపీ గట్టెక్కగలదు. రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆ తర్వాత బలనిరూపణ రోజున కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే బీజేపీ తమ బలంతోనే ప్రభుత్వాన్ని నిలుపుకోగలదు.