Advertisement

Advertisement


Home > Politics - Political News

గెలిస్తే బీజేపీ బలం.. ఓడితే పవన్ వైఫల్యం

గెలిస్తే బీజేపీ బలం.. ఓడితే పవన్ వైఫల్యం

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కల్యాణ్ ను, జనసైనికుల్ని బీజేపీ ఏ రేంజ్ లో వాడుకుంటోందో అందరం చూస్తూనే ఉన్నాం. తమ అభ్యర్థిని నిలబెట్టి, జనసైనికులతో హంగామా చేస్తోంది. అయితే ఈ వాడకం ఇక్కడితో ఆగడం లేదు. రేపు ఉదయం బీజేపీ ఓడిపోయిన తర్వాత కూడా జనసేనను ఎలా బలిపశువును చేయాలా అనే ఎత్తుగడల్లో బీజేపీ నిమగ్నమై ఉంది.

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యం అనేది ఎంత నిజమే, బీజేపీ ఓటమి కూడా తప్పదనేది అంతే నిజం. ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సరిగ్గా ఇక్కడే ఈ ఓటమిని జనసేన పార్టీపై వేసే బృహత్తర కార్యక్రమాన్ని బీజేపీ ఆల్రెడీ తెరవెనక మొదలుపెట్టింది.

తిరుపతి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కచ్చితంగా అతి తమ పార్టీ బలంగా ప్రచారం చేసుకుంటారు కమలనాథులు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఏపీలో కాలుమోపామని, తమ సత్తా పెరిగిందని, ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయం తామేనంటారు. ఓడిపోతే మాత్రం ఆ నెపం పవన్ పై నెట్టేస్తారు. గెలుపు మాది, ఓటమి బాధ్యత మిత్రపక్షానిది అనే లెక్కల్లో ఉన్నారు బీజేపీ నేతలు.

వైఫల్యానికి కారణాల వెదుకులాట..

టీడీపీ ఆల్రడీ తమ వైఫల్యాలకు కారణాలను వెదుక్కుంది. వాలంటీర్లపై నెపం నెట్టేసింది, డబ్బులు వెదజల్లుతున్నారని ప్రచారం చేస్తోంది. బీజేపీ మాత్రం ఓటమి భారాన్ని పూర్తిగా జనసేనపై నెట్టేయడానికి రెడీ అయింది. 

తిరుపతిలో ఓడిపోయినా, ఓటింగ్ శాతం బాగా తగ్గినా దానికి కారణం పవన్ కల్యాణే అని చెబుతారు. నేరుగా పవన్ ని టార్గెట్ చేసేంత సీన్ లేకపోయినా జనసైనికులపై నెపం నెట్టేస్తారు. జనసేన కలసి రాలేదని, జనసైనికుల ఓట్లు తమకు పడలేదని, అందుకే తిరుపతిలో తమకు ఓట్లు తక్కువ వచ్చాయని అంటారు.

ఎలాగూ గెలిచే సీన్ లేదు కాబట్టి.. ఓటమికి పవన్ కల్యాణ్ ను బాధ్యుడిగా చేసేందుకు అన్ని రకాలుగా తెరవెనక పావులు కదుపుతోంది బీజేపీ. అందుకే జాతీయ స్థాయి నేతలు ప్రచారానికి వస్తున్నా కూడా, పవన్ కల్యాణ్ నే తమ ప్రచారానికి ముఖచిత్రంగా బీజేపీ ఎంచుకుంది. పవన్ కల్యాణ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం వెనక మతలబు కూడా ఇదేనంటున్నారు చాలామంది.

క్షేత్రస్థాయిలో ఉన్న జనసైనికులకు ఈ విషయం ఈపాటికే అర్థమైంది. తిరుపతిలో మరోసారి నోటాతో పోటాపడి మరీ బీజేపీ దారుణంగా ఓడిపోతుందని వాళ్లకు తెలుసు. మరి ఈ కఠోర వాస్తవాల్ని పవన్ కల్యాణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?