cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

బ్రాండెక్స్ మూతపడింది

బ్రాండెక్స్ మూతపడింది

ఇపుడు అంతా మూసివేతలే. కరోనా మహమ్మారి రెడవ దశ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రత్యేకించి దేశంలో ఎక్కువగా ఉంది. దాంతో విశాఖ జిల్లా లాంటి చోట్ల రోజుకు రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 

ఈ నేపధ్యంలో జిల్లాలోని అచ్యుతాపురంలో బ్రాండిక్స్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా కంపెనీ భారతీయ భాగస్వామి దొరస్వామి తెలిపారు. బ్రాండిక్స్ కంపెనీలో దాదాపుగా 22 వేల మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

మరి ఇంత పెద్ద ఎత్తున జనాభా ఒకే చోట ఉంటే కరోనా విస్పోటనం జరిగితే చాలా ప్రమాదం అని భావించే ఈ కీలక నిర్ణయన్ని సంస్థ ప్రతినిధులు తీసుకున్నారు.

కేవలం ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలను కూడా ప్రాణాలను కాపాడాలి అన్న ఉద్దేశ్యంతోనే కొన్నాళ్ల పాటు బ్రాండిక్స్ ని మూసివేస్తున్నట్లుగా దొరస్వామి చెబుతున్నారు. వైఎస్సార్ హయాంలో విశాఖలో ప్రారంభించిన బ్రాండిక్స్ విజయవంతంగా ఇన్నేళ్ల పాటు పనిచేస్తూ వస్తోంది.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×