cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

స‌ర్వ‌ద‌ర్శనానికి మ‌ళ్లీ బ్రేక్‌

స‌ర్వ‌ద‌ర్శనానికి మ‌ళ్లీ బ్రేక్‌

శ్రీ‌వారి భ‌క్తుల‌కు మ‌ళ్లీ కోవిడ్ అడ్డంకిగా మారింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న ప‌రిస్థితుల్లో టీడీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 

శ్రీ‌వారి స‌ర్వ ద‌ర్శ‌నం కోసం జారీ చేసే టైమ్ స్లాట్ టోకెన్ల‌ను సోమ‌వారం నుంచి నిలిపివేయ‌నున్న‌ట్టు టీడీపీ ప్ర‌క‌టించింది. దీంతో ఉచిత ద‌ర్శ‌నం చేసుకునే భ‌క్తుల‌కు ఈ నెల 11వ‌ర‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది.

ఆ మ‌రుస‌టి రోజు నుంచి శ్రీ‌వారిని స‌ర్వ‌ద‌ర్శ‌నం చేసుకునే అవ‌కాశానికి కోవిడ్ గండికొట్టింది. కోవిడ్ కార‌ణంగా మునుపెన్న‌డూ లేన‌ట్టుగా తిరుమ‌ల‌లో శ్రీ‌వారి ఆల‌యాన్ని కొన్ని నెల‌ల పాటు మూసివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్ త‌గ్గుద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని అంచెలంచెలుగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌ను టీటీడీ అనుమ‌తిచ్చింది.

కానీ కోవిడ్ సెకెండ్ వేవ్ విజృంభిస్తుండ‌డంతో టీటీడీ అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల రాక‌ను త‌గ్గించే క్ర‌మంలో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీకి చెక్ పెట్టింది. మ‌ళ్లీ టోకెన్ల జారీ విష‌య‌మై ముంద‌స్తుగా ప్ర‌క‌టిస్తామ‌ని టీడీపీ వెల్ల‌డించింది. 

పవన్ కళ్యాణ్ కి రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా

నా పుట్టినరోజున లాహే లాహే పాట పాడాను

 


×