cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

టీడీపీ ఆ సీట్లు వైసీపీ చలవేనా ..?

టీడీపీ ఆ సీట్లు వైసీపీ చలవేనా ..?

ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. గత రెండేళ్లలో అడిగినవీ అడగనివీ కూడా అమలు చేసి చూపిస్తున్నారు. ఎన్నికల్లో చెప్పిన మేరకు తొంబై అయిదు శాతం పైగా హామీలను కూడా ఆయన నెరవేర్చారు.

అలాంటపుడు నూటికి నూరు శాతం ఫలితాలు వైసీపీకే రావాలి కదా. మరి జరిగిందేంటి.  ప్రతీ చోటా  తొంబై, ఎనభై శాతం ఫలితాలు ఎందుకు వచ్చాయి. దీని మీద ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తనదైన విశ్లేషణ అందించారు.

వైసీపీ చేసిన కొన్ని తప్పుల కారణంగానే టీడీపీకి ఆ మాత్రం సీట్లు అయినా వచ్చాయని ఆయన అంటున్నారు. లేకపోతే నూటికి నూరు శాతం పంచాయతీల్లో వైసీపీ జెండా ఎగిరేదని కూడా ఆయన గట్టిగా చెబుతున్నారు. 

అవును చాలా చోట్ల వైసీపీకి వైసీపీ నుంచే పోటీ ఎదురైంది. ఆ పార్టీని రెబెల్స్ దెబ్బ తీశారు. ఈ పరిణామంతోనే మధ్యలో టీడీపీ చాలా చోట్ల గెలిచింది అని తాపీగా ఇపుడు వైసీపీ నేతలు నిజాలు ఒప్పుకుంటున్నారు. 

మొత్తం మీద చూస్తూంటే వైసీపీ ఇంకా గట్టిగా నిలబడితే కుప్పం సీనే ఏపీ మొత్తం కనిపించేది అని వైసీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనని ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇపుడు ఒప్పుకుంటున్నారు.

దేశం మౌనం పాటిస్తోంది

ఆ పేరు కూడా పలకను

 


×