Advertisement

Advertisement


Home > Politics - Political News

మీకెంత రుణ‌ప‌డి ఉన్నామో చెప్ప‌లేంః ఉపాస‌న‌

మీకెంత రుణ‌ప‌డి ఉన్నామో చెప్ప‌లేంః ఉపాస‌న‌

మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు, యంగ్ హీరో రామ్‌చ‌ర‌ణ్ భార్య అయిన ఉపాస‌న సామాజిక అంశాల‌పై సోష‌ల్ మీడియాలో త‌న‌వైన అభిప్రాయాలు వెల్ల‌డిస్తుంటారు. ముఖ్యంగా క‌రోనా మొద‌టి వేవ్‌లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతూ వ‌చ్చారు. అలాగే సినీ కార్మికుల‌కు సాయం అందించ‌డంలో మామ చిరంజీవికి ఉపాస‌న అండ‌గా నిలిచి అభినంద‌న‌లు ద‌క్కించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఉపాస‌న స్పందించారు. ముఖ్యంగా కోవిడ్ నేప‌థ్యంలో వారి సేవ‌ల గురించి ఆమె కొనియాడారు. భార‌త జాతిగా న‌ర్సుల‌కు తామెంతో రుణ‌ప‌డి ఉన్నామ‌ని ఆమె చెప్పు కొచ్చారు. న‌ర్సుల సేవ‌ల‌పై ఉపాస‌న ఆస‌క్తిక‌ర ట్వీట్ గురించి తెలుసుకుందాం.

"కొన్ని నెల‌ల క్రితం ఈ దేవ‌దూత‌లతో గ‌డిపే ఆనంద‌మ‌య‌మైన క్ష‌ణాలు కొన్ని నాకు ల‌భించాయి. క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో ఫిబ్ర‌వ‌రి 2021 వ‌ర‌కు కొవిడ్‌-19తో 116 మంది న‌ర్సులు ప్రాణాల‌ను కోల్పోయారు. ఒక దేశంగా మేము మీకెంత రుణ‌ప‌డి ఉన్నా మో చెప్ప‌లేం. మీకివే నా నమః సుమాంజలి" అని ఉపాస‌న‌ పేర్కొన్నారు.

అపోలో హాస్పిట‌ల్‌లో కీల‌క భూమిక పోషిస్తున్న ఉపాస‌న‌కు వైద్య సిబ్బందితో ఉన్న అటాచ్‌మెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందుకే ప్ర‌త్యేకంగా న‌ర్సుల సేవ‌ల‌పై ఆమె స్పందించార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. యావ‌త్ భార‌త‌జాతిగా న‌ర్సుల‌కు రుణ‌ప‌డి ఉన్నామ‌నే ఒక్క వాక్యంతో ఆమె ఎంతో చెప్పారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?