cloudfront

Advertisement


Home > Politics - Political News

సామాజిక పింఛన్: జగన్ దెబ్బ.. చంద్రబాబు అబ్బ

సామాజిక పింఛన్: జగన్ దెబ్బ.. చంద్రబాబు అబ్బ

వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర చంద్రబాబుకి నిద్రలేకుండా చేస్తోంది. ముఖ్యంగా జగన్ ప్రకటించిన నవరత్నాలు చంద్రబాబు భవిష్యత్ ని ఆయన కళ్లకు కట్టాయి. అందుకే అప్పట్నుంచి అదను కోసం ఎదురుచూసిన బాబు.. ఎన్నికల కోడ్ విడుదలకు ముందే సామాజిక పింఛన్లను వెయ్యి రూపాయల నుంచి 2వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

నెల్లూరుజిల్లా బోగోలులో జరుగుతున్న ఆరోవిడత జన్మభూమి ముగింపు సభలో ఈ ఎన్నికల ఎత్తుగడను అమలుచేశారు బాబు. సంక్రాంతికి బోనస్ గా మరో వెయ్యి రూపాయలు ఇస్తారట. ఫిబ్రవరిలో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 3వేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు. ఇకనుంచి ప్రతినెలా మొదటి తేదీనే పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటానని నమ్మబలికారు.

ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు, పేదలపై ప్రేమతో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారనుకుంటే "పప్పు"లో కాలేసినట్టే. అధికారంలోకి రాగానే పింఛన్ ని 2వేలకు పెంచుతామని జగన్ ప్రకటించడం వల్లే చంద్రబాబు ఇప్పుడీ నాటకానికి తెరతీశారని అంటున్నారు.

ఓవైపు జగన్ ప్రజాసంకల్ప యాత్ర అట్టర్ ఫ్లాపైందని తమ్ముళ్లు మాట్లాడుతుంటే..  మరోవైపు ప్రజల మధ్య జగన్ ప్రకటించిన నిర్ణయాలను చంద్రబాబు అమలు చేయడాన్ని ఏమనుకోవాలని పలువురు మాట్లాడుకుంటున్నారు.

యాత్రలో జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ నవరత్నాల కార్యక్రమాన్ని ప్రకటించి ఏపీ ప్రజల మనసుల్లో కొత్త ఆశలు చిగురింపజేశారు. చంద్రబాబు పాలనతో విసిగి వేసారిన పేదలు, మధ్యతరగతి వాళ్లు.. జగన్ కోసం ఎదురుచూస్తున్నారు.

జగన్ పాదయాత్ర విజయవంతమైంది కాబట్టే, ప్రతి ఇంట్లో నవరత్నాల గురించి చర్చ జరుగుతోంది కాబట్టే చంద్రబాబు ఇలా ఆయన పథకాలను కాపీ కొడుతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు, ఇలా ప్రతిపక్ష నేత పథకాలను కాపీకొట్టడాన్ని ఏమనాలి?

జగన్ నవరత్నాల ప్రకటనని జేబులో పెట్టుకుని తిరుగుతున్న బాబు, ఇంచుమించుగా వాటినే అటుఇటు తిప్పి జనాలకు హామీలిస్తున్నారు. బాబు స్పీడ్ చూస్తుంటే.. జగన్ ప్రకటించిన నవరత్నాలను ఎన్నికలకు ముందే పేర్లు మార్చి అమలు చేసేట్టు ఉన్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?