cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు టార్గెట్ అదే..!

చంద్రబాబు టార్గెట్ అదే..!

అధికార మార్పిడి ఖాయమైపోయిన వేళ, టీడీపీకి ఘోర పరాభవం తప్పదని తేలిన వేళ, పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఎరగని ఓటమి ఎదురుచూడబోతున్న వేళ, చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరుకుంటోంది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం కల్పించాలని చూస్తున్నారు బాబు. తద్వారా రాష్ట్రంలో అనిశ్చితి వాతావరణం నెలకొనేలా చేయాలనేది బాబు ప్లాన్.

ఎన్నికలకు ముందే కేంద్రంతో గొడవకు దిగారు బాబు. ఎన్నికల సమయంలో తెలంగాణ సర్కార్ ని రెచ్చగొట్టారు. ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషన్ తో కయ్యం పెట్టుకున్నారు. అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తనపై చర్యలు తీసుకునే విధంగా కమిషన్ ని ప్రేరేపిస్తున్నారు చంద్రబాబు. ఇదంతా చంద్రబాబు ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.

ఓటమి ముంచుకొచ్చిన వేళ చంద్రబాబుకి సింపతీ కావాలి, వైసీపీ విజయంపై బురదజల్లాలి. అందుకే చాలా పగడ్బందీగా దీన్ని అమలులో పెట్టారు చంద్రబాబు. ఓటమి ఖాయమని తేలిన తర్వాత ఎడాపెడా టూర్లు వేస్తూ, కేంద్రాన్ని తిడుతూ, ఎన్నికల కమిషన్ ని రెచ్చగొడుతూ నానా హంగామా చేస్తున్నారు. అధికారులతో జరిపిన సమీక్షలు కూడా ఈ కోవలోనివే.

సమీక్షలు జరిపితే అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటుందని బాబుకి కూడా తెలుసు. తనకు కావాల్సింది కూడా అదే, అధికారులు బలికావాలి. వారిని అడ్డం పెట్టుకుని తనపై కక్షకట్టారని, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని బీద అరుపులు అరవాలి. అందుకే వ్యవస్థల్ని రెచ్చగొట్టే ధోరణిలో చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు.

ఈ ఎపిసోడ్ అంతటికీ బాబు అనుకూల మీడియా విపరీతంగా ప్రచారం కల్పిస్తోంది. తను మహానాయకుడినని, పదవీకాలం ముగిసే రోజు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాననే పేరు కోసం బాబు పరితపిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ ప్రజల్ని గాలికొదిలేసి, తన సంపాదన, కొడుకు రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన పడ్డ చంద్రబాబు... చివరి రోజుల్లో ఏదో చేస్తానంటూ హడావిడి సమీక్షలతో కాలం గడుపుతున్నారు.

ఈ విషయం తెలిసే ప్రతిపక్షనేత మౌనంగా ఉన్నారు. ప్రజలు, ప్రభుత్వ అధికారులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్