Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబుకు 'ఎన్టీఆర్ ఫోబియో' పట్టుకుంది

చంద్రబాబుకు 'ఎన్టీఆర్ ఫోబియో' పట్టుకుంది

చంద్రబాబు, లోకేష్ తిరుపతి సెగ్మెంట్ లో ప్రచారం చేయడం వెనక మతలబును బయటపెట్టారు మంత్రి పేర్ని నాని. తిరుపతిలో విజయం కోసం తండ్రికొడుకులు తిరగడం లేదని, కేవలం కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసమే వాళ్లు ప్రయాస పడుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ అంటే భయంతోనే బాబు-లోకేష్ తిరుపతిలో తిరుగుతున్నారని అన్నారు.

"చంద్రబాబు టీడీపీని కాపాడలేడని కార్యకర్తలకు తెలిసిపోయింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ భజన చేసే కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు, లోకేష్ అవుట్ డేటెడ్ అయిపోయారనే విషయం ఎమ్మెల్యేల దగ్గర్నుంచి జెండా మోసే కార్యకర్త వరకు అందరికీ అర్థమైపోయింది. 

ఆఖరికి బుచ్చయ్యచౌదరి కూడా ఎన్టీఆర్ రావాల్సిందేనంటున్నారు. దీంతో చంద్రబాబులో భయం పట్టుకుంది. అంతా కలిసి బస్సులు వేసుకొని హైదరాబాద్ వెళ్లి, ఎన్టీఆర్ ను పార్టీ ప్రెసిడెంట్ గా తెచ్చుకుంటారేమో అనే భయం పట్టుకుంది. అందుకే తండ్రికొడుకులిద్దరూ కార్యకర్తల్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లకు తిరుపతి ఎన్నిక ముఖ్యంకాదు, కార్యకర్తల్ని కాపాడుకోవడం ముఖ్యమైపోయింది."

లోకేష్ కు రాజకీయ వారసత్యం అందించలేకపోయిన చంద్రబాబు.. కనీసం కొడుక్కి మంచి బుద్ధి, మాటలు, సంస్కారం కూడా నేర్పించలేకపోయారని విమర్శించారు నాని. లోకేష్ నోరు విప్పితే బూతులు వస్తున్నాయని, అలాంటి చీప్ పొలిటీషియన్ ను ఎక్కడా చూడదలేదన్నారు.

ఇక పవన్ కల్యాణ్, నాగబాబుపై పై చేసిన వ్యాఖ్యలకు తను పూర్తిగా కట్టుబడి ఉన్నానని మరోసారి గుర్తుచేశారు మంత్రి పేర్ని నాని. ముందుగా పవన్ కల్యాణ్ కు రాబిస్ టీకా వేయించాలంటూ తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నాను.

"నన్ను రాబిస్ వ్యాక్సిన్ వేయించుకోమని నాగబాబు అన్నారు. కానీ నా ఉద్దేశంలో ఆ టీకా తక్షణ అవసరం నాగబాబు తమ్ముడికే. పవన్ కల్యాణ్ ఎక్కడ తిరుగుతున్నా అర్జెంట్ గా పట్టుకొని ఆయనకు వ్యాక్సిన్ వేయాలి. లేదంటే నాగబాబుకి కూడా ప్రమాదం. వాళ్లిద్దరూ వేయించుకుంటే, ఆ తర్వాత నేను కూడా వేయించుకుంటాను. ఈ స్టేట్ మెంట్ కు నేను కట్టుబడి ఉన్నాను."

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని, తాము చేసిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన తర్వాత ఓట్లు అడుగుతున్నామన్నారు పేర్ని నాని. తిరుపతి ఎన్నిక ప్రచారంలో ఏం చెప్పాలో టీడీపీ-బీజేపీలకు తోచడం లేదన్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?