cloudfront

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు మారడుకాక మారడు.!

చంద్రబాబు మారడుకాక మారడు.!

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. కానీ ఏం లాభం. 40 ఇయర్స్‌ పాలిటిక్స్‌ అని తనకు తానే డబ్బా కొట్టుకోవడం తప్ప ఏనాడూ అంత అనుభవం ఉన్న వ్యక్తిగా వ్యవహరించిన దాఖలాలు లేవు ఆయనకు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు 'అనుభవాన్ని' పసిపిల్లలు సైతం ప్రశ్నించేలా ఉంది. కారణం పలు అంశాల విషయంలో ఆయన అనుసరిస్తున్న అసహనపు వైఖరే.

మొన్నీ మధ్యనే ఉమ్మడి హైకోర్టు విభజన విషయమై చంద్రబాబు నానా యాగీ చేశారు. విభజన తప్పదని తెలిసి చంద్రబాబు చేసిన ఆ హంగామా నవ్వుల పాలైపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలోనూ చంద్రబాబు చేసిందదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు తొలుత లేఖ ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. 'విభజనకు మేం అనుకూలం' అని ప్రకటించి చంద్రబాబు, 2009 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్న విషయం విదితమే. 

ఇక, వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం, తథనంతర పరిణామాల్ని విశ్లేషిస్తే, చంద్రబాబు అనుభవం సమర్థత ఎంత అధమ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతుంది. కేంద్రం ఈ కేసును ఎన్‌.ఐ.ఏకి అప్పగించింది, అందుకు హైకోర్టు కూడా అనుమతిచ్చింది. కానీ చంద్రబాబు ఇప్పుడు తీరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయమై లేఖరాశారు. ఎన్‌ఐఏతో విచారణ జరిపించాల్సిన అవసరమేంటీ.? అంటూ లాజిక్కులు తీశారు. ఈ విషయమై న్యాయపోరాటానికి కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారట.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతపై దాడి జరగడం దారుణం. చంద్రబాబు సర్కార్‌ పాలనా వైఫల్యానికి నిదర్శనమిది. ప్రధానికి చంద్రబాబు లేఖ రాసినంత మాత్రాన కొత్తగా జరిగేదేమీ ఉండదు. తన పరువుపోయినా పర్లేదు. రాజకీయంగా ఏదో ఒక రచ్చచేయాలని ఆలోచిస్తుంటారాయన. తద్వారా వచ్చే పబ్లిసిటీ ఆయనకు ముఖ్యం. అడ్డగోలుగా వ్యవహరించి, జగన్‌ కోసమే చేశానని ముక్తాయింపు ఇవ్వడంలో చంద్రబాబుకు ఇంకెవ్వరూ సాటిరారు. 

తనయుడు చనిపోయినా షూటింగ్‌ పూర్తి చేసిన ఎన్టీఆర్‌

పబ్లిక్ పల్స్: వినయ విధేయ రామ ఎలా ఉందంటే?