cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

పరారీలో నేతలు.. పల్నాడులో చంద్రబాబు ప్రహసనం!

పరారీలో నేతలు.. పల్నాడులో చంద్రబాబు ప్రహసనం!

ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారెవరికీ తీవ్రమైన ఫ్యాక్షన్ బ్యాక్  గ్రౌండ్ లేదు. వాళ్ల పేర్లు చెబితేనే వాళ్లు ఏస్థాయి ఫ్యాక్షనిస్టులో అందరికీ తెలుస్తూనే ఉంది. అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కాసు మహేశ్ రెడ్డి.. ఇలాంటి వాళ్లు ప్రధానంగా పల్నాడు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నది. వీరు ఏస్థాయి ఫ్యాక్షనిస్టులో రాష్ట్రమంతటికీ తెలుసు!

ఇన్నాళ్లూ ఇదే పల్నాడులో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎవరంటే.. కోడెల శివప్రసాద్ రావు, యరపతినేని శ్రీనివాసరావు.. ఈ రెండు పేర్ల మీద ఇప్పుడు నమోదు అవుతున్న కేసులు, వారి పేర్లతో జరిగి బయటకు వస్తున్న బాగోతాల సంగతి అందరికీ తెలిసిందే. కోడెల పేరుతో దందాలు పల్నాడుతో మొదలుకుని రాయలసీమ వరకూ జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా కోడెల దందాలు వెలుగులోకి వస్తున్న వైనం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తూ ఉంది.

కోడెల దూడలు సాగించిన దందాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్లే గగ్గోలు పెడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్పీకర్ హోదాలో కూర్చుని..విలువైన ఫర్నీచర్ ను ఇంటికి తరలించుకువెళ్లిన, తనయుడి ఆఫీసుల్లో వాటిని ఉపయోగించుకుంటున్న కోడెల వారి గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే! ఇక యరపతినేని సంగతి సరేసరి. ఆయన మైనింగ్ మాఫియా గురించి సీబీఐ విచారణకు ఆదేశించాలని స్వయంగా కోర్టే ఆదేశాలు ఇచ్చేంత వరకూ వచ్చింది పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని టీడీపీ నేతలు పరారీల్లో ఉంటున్నారు.

ఈ పరారీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు కొట్టేస్తారనో, పొడిచేస్తారనో కాదు.. తమ పాత బాగోతాలపై ఇప్పుడిప్పుడు విచారణలు మొదలవుతున్న నేపథ్యంలో..ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందో అని తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతూ ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు నోటీసులు తీసుకువచ్చేలోపే పరార్ అయితే బాగుంటుందని వారు కాలికి బుద్ధి చెబుతూ ఉన్నారు. అధికారం ఉన్నన్ని రోజులూ అక్రమాలకు పాల్పడిన వారు ఇప్పుడు చట్టానికి భయపడి పరారీలో ఉన్నారు. నేతల తీరు ఇలా ఉంటే.. చంద్రబాబు నాయుడు ఇప్పుడు  చలో ఆత్మకూర్ అంటున్నారు.

ఇదీ కథ. తన పార్టీ వాళ్లు అరెస్టు భయాలతో పరార్ అవుతుంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రహసనానికి తెరతీశారు. పల్నాడులో పరిస్థితులు టీడీపీ హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే అంశం గురించి ఎవరో చెప్పనక్కర్లేదు. ఆ ప్రాంత వాసులకు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కే ట్యాక్స్ లు లేవు, మైనింగ్ మాఫియా చలగాటాలు లేవు. ఉన్నంతలో సాత్వికంగా వ్యవహరించే ఎమ్మెల్యేలే అక్కడ కనిపిస్తూ ఉన్నారు.

ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు నాయుడు అక్కడ చేయబోతున్న హడావుడి ముందుగానే నవ్వులపాలవుతూ ఉంది. ఏదో జరిగిపోతోందని చంద్రబాబు నాయుడు భ్రమలు కలిగించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం మీద ఇలా వ్యతిరేకత తీసుకురావాలని ఆయన అనుకుంటున్నట్టుగా ఉన్నారు. అయితే ఏ ప్రభుత్వం మీద అయినా ప్రజల నుంచి రావాలి వ్యతిరేకత. అదెలా ఉంటుందో.. గత ఐదేళ్లలో చూశారు.

ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం అయ్యింది. అంతేకానీ.. అక్రమాలు చేసి పరారీలో ఉన్న తన వారిని దాచిపెడుతూ చంద్రబాబు నాయుడు ఇలాంటి డ్రామాలు ఆడితే వచ్చే ప్రయోజనం ఎంతో ఆయనకే తెలియాలని పరిశీలకులు అంటున్నారు!

అదొక్కటే.. జగన్ తప్పుడు నిర్ణయం