cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

అరెరే.. చంద్రన్నకు ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందట!

 అరెరే.. చంద్రన్నకు ఎన్నికల కోడ్ అడ్డొచ్చిందట!

అదేదో సినిమాలో కమేడియన్ అంటూ ఉంటాడు.. 'నాకు రాబోయే ఐడియా నీకు వచ్చింది..' అంటూ. ఇప్పుడు చంద్రబాబు నాయుడి తీరు కూడా ఆ కామెడీకి తీసిపోవడం లేదు. ఇంతకీ బాబుగారి లేటెస్ట్ కామెడీ ఏమిటంటే.. అగ్రిగోల్డ్ బాధితులకు తనే సాయం చేయాలనుకున్నారట, అయితే తను సాయం చేయాలనుకోగానే ఎన్నికల కోడ్ వచ్చిందట. అందుకే సాయం చేయలేదట. 

ప్రస్తుత ప్రభుత్వం అగ్రీగోల్డ్ బాధితుల్లో కొందరికి అండగా నిలబడింది. పదివేల రూపాయల లోపు మొత్తాల వారికి వారి డబ్బులు  అందజేసి అండగా నిలిచింది. దీని వల్ల కూడా బాధితుల్లో ఎంతో మందికి ఊరట లభించింది. అగ్రిగోల్డ్ కేసు ఇప్పుడప్పుడే  తెగేలా లేదు. అది న్యాయస్థానం పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో చిన్న చిన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.

అయితే ఇలాంటి మంచి పనులు జరిగితే సహజంగానే పచ్చ కడుపులు  తరుక్కుపోయే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు కొత్త పాట మొదలెట్టారు. అదేమిటంటే.. తను సాయం చేయాలనుకున్నారట, అయితే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందట! ఇలా మాట్లాడేవారిని ఏమంటారో సోషల్  మీడియా నెటిజన్లకు బాగా తెలుసు!

అయినా.. పోలింగ్ కు వారం ముందు ఇచ్చిన పసుపు కుంకుమలకు, రైతు పెట్టుబడి సాయాలకు, రుణమాఫీ నిధులకు రాని ఎన్నికల కోడ్ అడ్డు రాలేదా?  సరిగ్గా పోలింగ్ కు ముందు రోజు కూడా డబ్బులు అందేలా చూశారు కదా! వాటన్నింటికీ అడ్డురాని ఎన్నికల కోడ్ .. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలోనే వచ్చిందా చంద్రబాబు! నవ్వి పోదురుగాక..మీకేంటి సిగ్గు కదా?