cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్రబాబు నిస్సిగ్గు ప్రకటనలు.. కలాం పైనా!

చంద్రబాబు నిస్సిగ్గు ప్రకటనలు.. కలాం పైనా!

ఇప్పటికే అబ్దుల్ కలాం పేరును ఎడాపెడా వాడుకుంటూ ఉన్నారు నారా కుటుంబీకులు. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిని చేసింది తనేనంటూ చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని వందల సార్లు ప్రకటించుకున్నారు. అయితే జనాలు ఎవరూ చంద్రబాబు ప్రకటనను  సీరియస్ గా తీసుకోలేదు.

సీరియస్ గా తీసుకోకపోయినా పర్వాలేదు కామెడీగా అయినా తీసుకోవాలన్నట్టుగా ఈ మధ్య నారా లోకేశం ఒక బాణం వేశారు. 2012లో కలాంను రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు చేశారంటూ.. లోకేష్ తనదైన కామెడీ చేశారు. అయినా కలాంను వాడుకోవాలనే దుగ్ధ నారా ఫ్యామిలీకి తీరినట్టుగా లేదు. 

చంద్రబాబు మరో మాట  సెలవిచ్చారు. అదేమిటంటే.. అబ్దుల్ కలాం విజన్ ను తన దగ్గర నుంచినే నేర్చుకున్నారని చంద్రబాబు నాయుడు ఒక మాట వదిలారు. తను విజన్ ట్వంటీట్వంటీ అని ప్రకటిస్తే..దాన్నే అబ్దుల్ కలాం కాపీ కొట్టారు అనేంత స్థాయిలోఉంది చంద్రబాబు నాయుడిగారి తాజా మాటల సారాంశం! దేనికైనా ఒక హద్దుంటుంది కానీ చంద్రబాబు నాయుడి డబ్బా కొట్టుడుకు మాత్రం  హద్దే ఉండదని సోషల్ మీడియాలో జనాలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఈ విషయంలో!