Advertisement

Advertisement


Home > Politics - Political News

చంద్ర‌బాబు నాయుడు..ఇంటింటి ప్ర‌చారం!

చంద్ర‌బాబు నాయుడు..ఇంటింటి ప్ర‌చారం!

ఒక పార్టీ అధినేత, ఒక‌టికి వెయ్యి సార్లు త‌న‌ను తాను ఒక అంత‌ర్జాతీయ నేత‌గా అభివ‌ర్ణించుకునే వ్య‌క్తి, 14 సంవ‌త్స‌రాల పాటు సీఎం, మ‌రో 12 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌... ఇంత ట్రాక్ రికార్డును డ‌ప్పేసుకునే చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం పరిధిలో వీధివీధీ తిరుగుతూ ప్ర‌చారం చేసుకుంటూ ఉన్నారు!

ఏకంగా ఎనిమిది రోజుల పాటు చంద్ర‌బాబు నాయుడు తిరుప‌తి ప్ర‌చారంలో తిరుగుతుండ‌టంతో.. ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలోని వీధివీధీ తిరిగేంత తీరిక దొరికిన‌ట్టుగా ఉంది. సాధార‌ణంగా ఏదైనా పార్టీ అధినేత ఒక నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌చారానికి వెళితే ఒక‌టీ రెండు చోట్ల స‌భ‌లు పెడితే అదే గొప్ప‌. 

ప్ర‌త్యేకించి ఉప ఎన్నిక‌ల విష‌యంలో అయితే.. అధినేత స్థాయి వాళ్లు లైట్ తీసుకుంటారు. అది కూడా పోటాపోటీ ఉన్న చోట అయితే ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్లు గ‌ట్టిగా పోరాడ‌వ‌చ్చు. అయితే తిరుప‌తిలో టీడీపీకి అంత సీన్ క‌నిపించ‌డం లేదు. అయిన చంద్ర‌బాబు నాయుడు వీధివీధి ప్ర‌చారానికి దిగారు. ఇంటింటినీ ప‌ల‌క‌రిస్తున్న‌ట్టున్నారు.

ఇప్ప‌టికే చిన‌బాబు లోకేష్ అక్క‌డ వారం నుంచి క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నారు. ఆయ‌న కామెడీ ఆయ‌న చేస్తూ ఉన్నారు. మ‌రోవైపు చంద్ర‌బాబు నాయుడు ఇలా వీధివీధీ తిరుగుతున్న ఫొటోలు సోష‌ల్ మీడియాకు ఎక్కుతున్నాయి. 

మొత్తానికి అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక విమానాలు, విదేశీ విహారాలు చేసిన చంద్ర‌బాబు నాయుడు అధికారం చేజారే స‌రికి ఇలా ప్ర‌చార వాహ‌నం కూడా దిగి వీధివీధి ప్ర‌చారానికి పూనుకోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి టీడీపీ అధినేత ఇలా ఇళ్లిల్లూ తిరుగుతూ చేస్తున్న ప్ర‌చారానికి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో, తిరుప‌తి బై పోల్ లో టీడీపీ అభ్య‌ర్థి ఎంత శాతం ఓట్ల‌ను పొందుతారో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?