cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

యాంక‌ర్ క‌త్తి కార్తీకపై చీటింగ్ కేసు

యాంక‌ర్ క‌త్తి కార్తీకపై చీటింగ్ కేసు

క‌త్తి కార్తీక ...బుల్లితెర యాంక‌ర్‌. బుల్లితెర‌పై ఎన్నాళ్లు క‌నిపించినా పెద్దగా సంపాదించ‌లేమ‌ని భావించిన‌ట్టుంది. ప్ర‌స్తుతం ఆమె రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న‌ట్టు తాజాగా వెలుగు చూసిన ఘ‌ట‌న‌ను బ‌ట్టి తెలుస్తోంది. 

త‌న‌ది కాని స్థ‌లాన్ని, డెవ‌ల‌ప్‌మెం ట్‌కు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి , కోటి రూపాయ‌లు తీసుకుని, చివ‌రికి అస‌లు నిజం బ‌య‌ట ప‌డ‌డంతో పంచాయితీ కేసు వ‌ర‌కు వెళ్లింది. యాంక‌ర్‌తో పాటు మ‌రో ఏడుగురిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో న‌మోదైన చీటింగ్ కేసు వివ‌రాలు తెలుసుకుందాం.

పచ్చిపాల దొరస్వామి అనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని టచ్‌స్టోన్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఈయ‌న ఎండీ. వ్యాపారంలో భాగంగా న‌గ‌ర శివారులో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేప‌ట్టాల‌ని భావించాడు. ఈ విష‌య‌మై ప‌రిచ‌య‌స్తుడైన  ఆర్కిటెక్ట్‌ శ్రీధర్‌ గోపిశెట్టితో చెప్పాడు. ఇందుకోసం త‌న‌కు స్థ‌లం కావాల‌న్నాడు.

ఈ విష‌యం తెలుసుకున్న యాంక‌ర్ ... కార్తీక గ్రూపు పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ‌ను న‌డుపుతున్నాన‌ని, భూక్ర‌య‌విక్ర‌యాల‌కు మ‌ధ్య‌వ‌ర్తిగా వ్యవ‌హ‌రిస్తుంటాన‌ని ఆమె న‌మ్మ‌బ‌లికారు. కార్తీక‌ను  ఈ ఏడాది ఏప్రిల్‌లో దొరస్వామికి  శ్రీధర్‌ పరిచయం చేశాడు. 

మెద‌క్ జిల్లా అమీన్‌పూర్ గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్  322, 323, 324, 329లో 52 ఎకరాల స్థలం ఉందని, ఇందులో త‌మ‌కు కొంగ భాగం వాటా ఉంద‌ని కార్తీకతోపాటు నువ్వాల శివరాంప్రసాద్‌, తన్నేరి భీమ్‌సేన్‌, అందె మురళీకృష్ణ, జాగృత్‌లాల్‌,  మోహన్‌ సంతోష్‌ తదితరులు దొరస్వామిని నమ్మించారు.

ఈ స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం రూ.35 కోట్లకే ఇప్పిస్తామని, ఇందుకు రూ.కోటి సెక్యూరిటీ డిపాజిట్‌గా తమకు ఇవ్వాల్సి ఉంటుందని వారు చెప్పారు. ఒక‌వేళ స్థల ఒప్పందం కుదరకపోతే వారంలో డిపాజిట్‌ను తిరిగి ఇచ్చేస్తామని  చెప్పారు. వాళ్ల మాయ‌మాట‌లకు దొర‌స్వామి బోల్తా ప‌డ్డాడు.  కార్తీక గ్రూప్‌ సంస్థతోపాటు ఆమె సూచించిన బ్యాంకు ఖాతాలకు రూ.కోటి పంపించాడు.

తీరా ఆ స్థలంపై దొరస్వామి ఆరాతీయగా అస‌లు వాస్త‌వాలు తెలిసి దొర‌స్వామి ఖంగుతిన్నాడు. ఆ స్థలం సీస్ల రమేశ్‌, ఆయన సంస్థకు చెందింద‌ని తేలింది. 

యాంక‌ర్ కత్తి కార్తీక, ఆమె వెంట వచ్చినవారికి స‌ద‌రు స్థ‌లంతో ఎలాంటి సంబంధం లేద‌ని తెలిసి ల‌బోదిబోమ‌న్నాడు. దీంతో త‌న‌ను క‌త్తి కార్తీక‌తో పాటు ఆమె స్నేహితులు త‌న‌ను మోసం చేశార‌ని బంజారాహిల్స్‌ పోలీసులకు దొరస్వామి ఫిర్యాదు చేశాడు. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంది. క‌త్తి కార్తీక ఎంత ప‌నిచేసింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

నన్నెవడూ పీకలేడు

ఈనాడు,జ్యోతి ప‌ట్టించుకోలేదు

 


×