cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

చెదిరిపోయిన పవన్ కులాల ఐక్యత కలలు

చెదిరిపోయిన పవన్ కులాల ఐక్యత కలలు

అనుకోకుండా జరుగుతుంటాయి కొన్ని. టాలీవుడ్ లో మా ఎన్నికలు ఇలాగే జరిగాయి. ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో అన్నట్లు అయింది వ్యవహారం. హోరా హొరీ గా జరిగిన ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలుపొందింది. అది కాదు పాయింట్...మెగా ప్యానల్ ఓడింది. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకొకపోయినా, మెగా ప్యానల్ గానే ముద్రపడింది ప్రకాష్ రాజ్ వర్గం. 

గత రెండేళ్లుగా ముఖ్యంగా కరోనా రెండో ఫేజ్ టైమ్ లో మెగాస్టార్ తాను చేసే దాన ధర్మాలకు ప్రచారం కల్పించడం మొదలైంది. ఓ టీమ్ అందుకోసం పకడ్బందీగా పని చేయడం ప్రారంభమైంది. చాలా తెలివిగా కంటెంట్ ను పంప్ చేయడం మొదలైంది. దాని కోసం ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఏర్పాటైంది.  

కొందరు దర్శకులు, సినిమా జనాలు, ఈ పల్లకీ మోత కార్యక్రమానికి భుజం కలిపారు. అసలు మెగాస్టార్ ఎందుకు సాయం చేయాలి. రాజకీయ నాయకులను అడుగుతున్నారా? అనే ఎదురు ప్రశ్నలు సంధిస్తూనే, ఆయన చేసే చిరుసాయాలు అన్నింటినీ గ్లోరిఫై చేయడం ప్రారంభమైంది.  

కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చిరు ప్యానల్ ఓడిపోవడంపై జరుగుతున్న హడావుడి చూస్తుంటే, చేసిందంతా బూడిదపాలు అయినట్లు వుంది. అస్సలు ఆ వైనాలు, ఆ కథనాలు ఎక్కడా లేవు. ఇప్పుడంతా ఈ ఓటమి కథనాలే.

ఇక మరో పిట్ట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కమ్మవారికి ఏదో అయిపోతోంది. వారిని ఉద్దరించాల్సి వుంది అంటూ ఆంధ్ర స్పీచ్ లు దంచారు. కానీ ఇప్పుడేమయింది. కమ్మవారు..రెడ్లు కలిసి మరీ కాపు మద్దతు ప్యానల్ అనుకున్న దానిని పక్కన పెట్టారు. అవసరం అయితే కమ్మ..రెడ్లు కలుస్తారేమో కానీ కాపులను అధికారం దగ్గరకు రానివ్వరు అన్నట్లు కలర్ కనిపించింది.

ఎప్పటికైనా కమ్మ-కాపులను కలపాలని, ఆ బలాన్ని చంద్రబాబుకు మరింత బలంగా మార్చి ఆయనను అధికారంలోకి తేవాలని పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. కానీ ఇప్పుడేమయింది. కాపు..కమ్మ మళ్లీ ఉప్పు నిప్పు అయినట్లే కదా. ఇప్పుడు వస్తున్న కథనాలు అన్నీ చూసి తెలుగుదేశం జనాలు, దాని మద్దతు జనాలు. కిందా మీదా అవుతున్నారు. కమ్మ-కాపులను కలుపుదాం అనుకుంటే ఇలా జరిగిందేమిటీ అని బాధ పడుతున్నారు.

ఈ కథనాల చూసి గ్రౌండ్ లెవెల్ లో కాపు కమ్మవారికి ఓటేస్తారా? అని లెక్కలు కడుతున్నారు. కమ్మవారు కాపులకు ఎలాగూ వేయరు. కమ్మవారి పల్లకీ కాపులతో మోయించాలనే పవన్ కళ్యాణ్ ప్లాన్ వేస్తున్నారని రాజకీయ గ్యాసిప్ లు వున్నాయి. ఇప్పుడు ఆ వ్యూహాలన్నీ ఫట్ అయిపోయాయి.

తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే కమ్మ సామాజిక వర్గం తప్పనిసరి పరిస్థితుల్లో మా ఎన్నికల్లో మెగా వర్గానికి ఎదురుగా నిలిచింది. గెలిచింది. ఆ తరువాత మౌనంగానే వుంది. కానీ దాన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో మెగా వర్గాన్ని ఓ లెక్కలో ఆడుకుంటున్నారు. 

కమ్మ సామాజిక వర్గం మౌనంగానే వున్నా, కాపు వర్గానికి మాత్రం ఇది మండిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే ఆ మంట మరింత పెరిగే ప్రమాదం వుంది. పైగా ఆ పొత్తు రెండు వైపుల నుంచి వికటించే అవకాశం వుంది.

మొత్తానికి మా ఎన్నికలు ఫలితం మామూలు బ్లాస్ట్ కాదు. 

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×