Advertisement

Advertisement


Home > Politics - Political News

తీరిన అమిత్ షా ప్రతీకారం.. జగన్ ఫ్యాన్స్ హ్యాపీ!

తీరిన అమిత్ షా ప్రతీకారం.. జగన్ ఫ్యాన్స్ హ్యాపీ!

చెడపకురా చెడేవు.. అనేది సామెత. కాంగ్రెస్ హయాంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు సీబీఐ, ఈడీలను విచ్చలవిడిగా వాడిన వ్యక్తిగా చిదంబరానికి పేరుంది. తమ సోనియాగాంధీని ఎదురించాడని చెప్పి జగన్ మోహన్ రెడ్డి బోలెడన్ని కేసులు పెట్టించి పదహారు నెలల పాటు జైల్లో పెట్టించడంలో చిదంబరానికే కీలకపాత్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడం దగ్గర నుంచి జగన్ ను జైల్లో పెట్టించడం, రాష్ట్ర విభజనకు పాల్పడటం వంటి వ్యవహారాలన్నింటిలోనూ చిదంబరానిదే కీలకపాత్ర అని అప్పట్లో ఢిల్లీ వర్గాలు వ్యాక్యానిస్తూ వచ్చాయి.

ఏపీని విభజిస్తే ఢిల్లీలో తెలుగువాళ్ల వాయిస్ ను తగ్గించేయవచ్చు అనేది ఈ తమిళుడి కుటిల వ్యూహం అనే విశ్లేషణలు కూడా వినిపించాయి. ఇక చంద్రబాబు కూడా చిదంబరంతో చాలా సన్నిహిత సంబంధాలు నెరిపారనేది స్వయంగా చిదంబరమే చెప్పిన విషయం. అలా అప్పట్లో సూపర్ పవర్ గా ఉండిన చిద్దూతో చంద్రబాబు నాయుడు సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేశారు. అయితే ఇవేవీ ఇప్పుడు చిదంబరం ఎదుర్కొంటున్న పరిస్థితులకు కారణం కాకపోవచ్చు.

అసలు కథ అమిత్ షాను ఇబ్బంది పెట్టడమే. సొహ్రాబుద్ధీన్ ఎన్ కౌంటర్లో అమిత్ షాను మూడు నెలలపాటు జైల్లో పెట్టడం వెనుక చిదంబరం హస్తం ఉందంటారు. పార్లమెంటులో హిందూటెర్రర్ అనే పదాన్ని ఉపయోగించింది కూడా చిదంబరమే. సీబీఐని అప్పట్లో చిద్దూ ఉపయోగించి అమిత్ షాను జైలుకు పంపాడంటారు. దీంతో అప్పుడు గుజరాత్ హోం మినిస్టర్ పదవిని కోల్పోయారు అమిత్ షా. చిత్రంగా అదే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రయ్యారు.

తను కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షాను చిదంబరం జైలుకు పంపితే, తను ఆ స్థానంలోకి వచ్చాకా అమిత్ షా చిదంబరాన్ని జైలుకు పంపాడని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఏతావాతా అమిత్ షా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అధికార దుర్వినియోగం చేసి సీబీఐని ఉపయోగించుకుని తమ జగన్ ను జైలుకు పంపిన చిదంబరం ఇప్పుడు అదేరీతిన జైలుకు వెళ్లడం పట్ల జగన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. చెడపకురా చేడేవు అనే సామెత ఊరికే రాలేదనే విషయాన్ని గుర్తుచేస్తూ ఉన్నారు!

జగన్నాటకంలో మంత్రులకు సీన్‌ సితారే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?