Advertisement

Advertisement


Home > Politics - Political News

క‌రోనా వైర‌స్ విష‌యంలో ఇండియాకు చైనా విన్న‌పం!

క‌రోనా వైర‌స్ విష‌యంలో ఇండియాకు చైనా విన్న‌పం!

క‌రోనా వైర‌స్ విష‌యంలో భార‌త విదేశాంగ శాఖ‌కు చైనా ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన విన్న‌పాన్ని చేసింది. క‌రోనా వైర‌స్ పేరు విష‌యంలో చైనా ఈ విన్న‌పాన్ని చేయ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా వైర‌స్ ను చైనా వైర‌స్ అంటూ పిల‌వొద్దు అని భార‌త విదేశాంగ శాఖ‌ను చైనా విన్న‌వించింది. చైనా కేంద్రంగా ఈ అంటు వ్యాధి బ‌య‌ల్దేరిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌పంచ చైనాను నిందిస్తూ ఉంది.

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే చైనా తీరును తీవ్రంగా దుయ్య‌బ‌ట్ట‌డ‌మే కాదు, క‌రోనా వైర‌స్ ను చైనా వైర‌స్ అంటూ పిలిచారాయ‌న‌. అమెరికా అధ్య‌క్షుడు అలా పిల‌వ‌డంతో.. అమెరికాలోని ఆయ‌న భ‌క్తులు క‌రోనా వైర‌స్ కు చైనీ వైర‌స్ అంటూ పేరును ఖ‌రారు చేసుకున్నా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. త‌మ దేశం నుంచి మొద‌లైన వైర‌స్ అంటే చైనా ఒప్పుకోవ‌డం లేదు. అమెరికా నుంచినే ఈ వైర‌స్ మొద‌లైంద‌ని చైనా వాదించింది. అయితే క‌రోనా విజృంభ‌ణ మొదట చైనాలోనే జ‌ర‌గ‌డంతో... చైనా వైపే అన్ని వేళ్లూ చూపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో ఇండియాకు చైనా త‌న విన్న‌పాన్ని తెలియ‌జేసింది. క‌రోనా వైర‌స్ ను చైనీ వైర‌స్ అని పిల‌వొద్దు ప్లీజ్ అని ఇండియాను కోరింది చైనా. ఈ మేర‌కు విదేశాంగ శాఖ‌కు ఫోన్ చేశార‌ట చైనా విదేశాంగ కీల‌క వ్య‌క్తులు. క‌రోనా వైర‌స్ ను క‌రోనా వైర‌స్ అనే పిల‌వాల‌ని, దాన్ని చైనా వైర‌స్ అంటూ ఇండియాలో వ్య‌వ‌హ‌రించ‌వ‌ద్ద‌ని వారు కోరార‌ట‌. ఈ విన్న‌పం ప‌ట్ల భార‌త్ కొంత సానుకూలంగానే స్పందించవ‌చ్చు.

21 రోజులు మొత్తం దేశమంతా లాక్ డౌన్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?