cloudfront

Advertisement


Home > Politics - Political News

నేను నోరువిప్పితే పవన్ అన్నీ మూసుకోవాలి

నేను నోరువిప్పితే పవన్ అన్నీ మూసుకోవాలి

తెలంగాణ, ఆంధ్రా ప్రజల్ని రెచ్చగొడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సినీరచయిత చిన్నికృష్ణ విరుచుకుపడ్డారు. తను కూడా కాపు కులస్తుడినేనని, దయచేసి కాపుల్లో చీలిక తీసుకురావొద్దని విజ్ఞప్తిచేశారు. చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటే, పవన్ ఎందుకు కంగారు పడుతున్నారో తనకు అర్థంకావడం లేదంటున్నారు చిన్నికృష్ణ.

"కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ మాకివ్వొద్దని పవన్ అంటున్నారు. పవన్ కు కేసీఆర్ ఎప్పుడూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననలేదు. అలాంటప్పుడు పవన్ ఎందుకు కంగారుపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర తేడాలేకుండా అందరం ఇక్కడ మిక్స్ అయి ఉన్నాం. చాలా హ్యాపీగా జీవిస్తున్నాం. మీరెందుకు రెచ్చగొడుతున్నారు. రాజకీయాలు చేయండి కానీ రాష్ట్రాల్ని విడదీయకండి. మా జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు."

కాపుల మీదే స్టార్స్ అయిన మెగా హీరోలు ఆ కాపుల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు చిన్నికృష్ణ. దయచేసి తనలాంటి కాపుల్ని రెచ్చగొట్టదని, తను నోరువిప్పితే పవన్ తన నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు చిన్నికృష్ణ.

"విను పవన్, నీ గురించి నేను తోరుతెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీరు ఏ పార్టీతో చేతులు కలిపారో ఆ పార్టీవాళ్లందరికీ చెబుతున్నాను. దయచేసి నన్ను నోరుతెరిచేలా చేయనీయకండి. రేపు ఎన్నికల ఫలితాల రోజున టీవీల ముందు కూర్చునే మీ అందరికీ గుండెలు పగిలిపోతాయి. జగన్ అంత మెజారిటీతో గెలవబోతున్నారు. కాపు బేస్ మీదే మీ హీరోలందరూ నడిచారు. వంద సినిమా టిక్కెట్లు తెగితే అందులో 75శాతం కాపులవే. కాపులు వేసిన ఓట్లతో గెలిచి, కోట్లు సంపాదించి ఒక్క పరిశ్రమైనా స్థాపించారు. మెగా కుటుంబాన్ని నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఒక ఫిలింస్టూడియో పెట్టారా?".

ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెడుతూ, కాపుల్ని రెచ్చగొడతున్న పవన్ ను నమ్మొద్దని పిలుపునిచ్చారు చిన్నికృష్ణ. ఇప్పటికే ఓసారి మోసపోయింది చాలని, మరోసారి పవన్ ను నమ్మి మోసపోవద్దన్నారు. పవన్ వ్యాఖ్యలతో రాబోయే రోజుల్లో సినీపరిశ్రమకు ఏదైనా జరిగితే ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. బాగా డబ్బులు సంపాదించుకున్న మెగా హీరోలు మాత్రం సైడ్ అయిపోతారని సెటైర్లు వేశారు.

"కాపు సోదరులకు నేను చెప్పేదొకటే. అయ్యా.. మీలాగే మేమూ మెగాహీరోల్ని ఇష్టంపడ్డాం. మీలాగే మేమూ ప్రేమించాం. మీకంటే ఎక్కువ కష్టపడి ఇంద్ర అనే సినిమా రాశాను. నా బిడ్డల సాక్షిగా చెబుతున్నాను ఇంతవరకు నాకు విస్తరాకు వేసి అన్నం పెట్టలేదు. 10 రూపాయలు పెట్టి పెన్ను కూడా కొనలేదు. నేను కూడా కాపునే. దయచేసి వాళ్లను నమ్మొద్దు. మరోసారి మోసపోవద్దని కాపు సోదరులకు చెబుతున్నాను. ఆంధ్రాలో ఫీజు రీఇంబర్స్ మెంట్ రాక నాకు తెలిసిన కుటుంబాల పిల్లలు తెలంగాణ వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. దీనిపై నువ్వు ఎందుకు మాట్లాడవు పవన్. దయచేసి కాపుల్ని మభ్యపెట్టకండి."

ఆరోగ్యశ్రీ అందక అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎంతమంది పేదలు చనిపోతున్నారో తెలుసా అంటూ పవన్ ను ప్రశ్నించారు చిన్నికృష్ణ. జస్ట్ 62 పిల్లర్లతో విజయవాడలో ఫ్లై ఓవర్ కూడా కట్టలేని చంద్రబాబును పవన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. 

అమరావతి ప్రస్తావన లేని ఎన్నికలు!