Advertisement

Advertisement


Home > Politics - Political News

చిరంజీవి..జనసేన...కాపు కాయడానికేనా

చిరంజీవి..జనసేన...కాపు కాయడానికేనా

పార్టీకి ఊపు తేవాలనో, తిరుపతి సీటు డిమాండ్ కు బలం రావాలనో, మరే కారణం చేతనో జనసేన లెఫ్ట్ నెంట్ మనోహర్ మెగాస్టార్ చిరంజీవి పేరు తెరపైకి తెచ్చారు. జనసేనకు మద్దతుగా మెగాస్టార్ రంగంలోకి దిగుతారని ప్రకటించేసారు. అయితే అసలు చిరంజీవి మనోగతం ఏమిటి? 

ఇది తెలియాలి అంటే గత ఏప్రిల్ లో మెగాస్టార్ తో 'గ్రేట్ ఆంధ్ర' ముచ్చటించినపుడు ఆయన ఏమన్నారో చూద్దాం.

ప్రశ్న- రాజకీయాల సంగతేమిటి? వదిలేసినట్లేనా?

జవాబు..వద్దండీ. మా ఇంట్లో. తమ్ముడున్నాడు. మిగిలిన వాళ్లు అతనికి మద్దతుగా నిలవాలి. అంతే కానీ, చెరో వైపు వుండి, మమ్మల్ని అభిమానించే అభిమానుల్లో అయోమయం నెలకొనకుండా వుండడం ముఖ్యం. అందువల్ల నేను నా తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నాను. తను అగ్రసివ్ గా పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. ఈ రోజు కాకున్నా, ఎప్పుడో ఒకరోజు తను అనుకున్నది సాధిస్తాడు, ఆ నమ్మకం వుంది. 

అందువల్ల..యస్..మా సపోర్ట్ కళ్యాణ్ కే. అదొక కారణం అయితే కాంగ్రెస్ అన్నది దాదాపు లేకుండా పోయింది. మేమంతా జాబ్ లెస్ అయిపోయాము. వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ కొత్తగా ప్రారంభించడం, ఈ  64 ఏళ్ల వయసులో అవన్నీ నేను చేయలేను. చాలు,. నా ప్రయత్నం నేను చేసాను. హానెస్ట్ గా చేసాను. ..

ఇదీ మెగాస్టార్ మనసులోని మాట. 64 ఏళ్ల వయసులో కొత్తగా ఆయన రాజకీయాలు చేయలేరు..అలాగే కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో వుండడం పద్దతి కాదు. అందుకని పవన్ కు మద్దతు ఇస్తా అని ఆనాడు చెప్పారు. అంతే తప్ప తానేదో ప్రచారం చేస్తానని, క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. పైగా పవన్ తనంతట తాను పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడని, అనుకున్నది సాధిస్తాడని అన్నారు తామంతా కలిసి ఏదో సాధిస్తాం అనలేదు.

మరి ఇప్పుడు మనోహర్ ఎందుకు మెగాస్టార్ ప్రస్తావన తెచ్చినట్లు?

దీని వెనుక చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకటి కాస్త లాజికల్ గావుంది. భాజపా అధ్యక్షుడిగా సొము వీర్రాజు వచ్చిన లగాయతు ఆయన పలువురు కాపు ప్రముఖులను భాజపా లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన మీద నమ్మకం తక్కువ వుండడం వల్ల కావచ్చు, జాతీయ పార్టీ అనే నమ్మకం వల్ల కావచ్చు. 

చాలా మంది అటే వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా కాపులు భాజపా తీర్థం తీసుకుంటే జనసేన పరిస్థితి ఏమిటి? మరి జనసేన కూడా సీరియస్ రాజకీయాలు చేస్తుందని నమ్మకం కలిగించాలి కదా? పైగా కాపులకు అది మన పార్టీ అనే భావన కూడా కలిగించాలి. ఈ రెండూ జరగాలంటే పవన్ పేరుకు మెగాస్టార్ పేరు తోడైతే ఆ లుక్ నే వేరు.

బహుశా అందుకే మనోహర్ ఈ మాట అని వుంటారని ఓ టాక్. కానీ ఇక్కడ సమస్య కూడా వుంది. ఇప్పటికే పవన్, నాగబాబు వున్నారు. మెగాస్టార్ తోడవుతారు. అప్పుడు ఇదో మెగా ఫ్యామిలీ పార్టీ అన్నట్లుగానూ, అదే సమయంలో ప్రజారాజ్యం కు మరో పేరు అన్నట్లుగా వుంటుంది. పైగా కాపు సామాజిక వర్గ పార్టీ అని ముద్రపడిపోతే మిగిలిన తూకాలు అన్నీ తేడా వచ్చేస్తాయి. 

ఏతా వాతా మనోహర్ ఆలోచించో, అనాలోచితంగానో వేసిన ఓ మాట జనసేనకు బలం చేకూర్చడం మాట అలా వుంచి, మరింత అయోమయంలోకి నెట్టేలా వుంది.

థియేటర్లకు ఇంకా కష్టం

జ‌గ‌న్ పార్టీ ఉనికిని కాపాడింది ష‌ర్మిలే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?