cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

'చిరు' పదవి...పవన్ టెన్షన్..?

'చిరు' పదవి...పవన్ టెన్షన్..?

మెగాస్టార్ చిరంజీవికి వైకాపా రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తుందని వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. వైకాపా అంతర్గత వర్గాల్లో ఈ వార్త బలంగా వినిపిస్తోంది. ఈ వార్త‌ బయటకు రాగానే జనసేన అధిపతి, చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ అర్జెంట్ గా హుటాహుటిన మెగాస్టార్ ఇంటికి వెళ్లినట్లు మెగా క్యాంప్ వర్గాల్లో వినిపిస్తోంది.

జస్ట్ క్యాజువల్ విజిట్ అన్నట్లు వెళ్లినా, రాజ్యసభ వార్తల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తనకు తెలిసి అలాంటిదేదీ లేదని మెగాస్టార్ తమ్ముుడు పవన్ కు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. వైకాపా కనుక ఈ స్ట్రాటజీతో వెళ్తే చాలా తేడాగా వుంటుంది. 

చిరు-పవన్ ల మార్గాలు వేరు వేరు అవుతాయి. నాగబాబు కూడా ఎటూ మొగ్గలేక సైలంట్ కావాల్సి వుంటుంది. జనసేనకు మద్దతు ఇచ్చే చిరు అభిమానులు అంతా అయోమయంలో పడతారు. కాపు ఓట్లు కూడా జనసేనకు గంపగుత్తగా పడే పరిస్థితి మారిపోతుంది. 

నిజంగా వైకాపా రాజ్యసభకు చిరు ను పంపే ఆలోచన చేయాలి. ఆయన ఓకె అనాలే కానీ తెలుగు నాట రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తుంది ఈ విషయం. అందుకే అంత అర్జెంట్ గా పవన్ నేరుగా చిరు దగ్గరకు వెళ్లి క్లారిఫికేషన్ తీసుకుని వుంటారు.

స్టార్ హీరోలతో చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేదు

అందుకే కాంగ్రెస్ సీనియర్లు జగన్ వెంట రాలేదు

 


×