cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

కాంగ్రెస్ నేతలు.. చేతులెత్తేసిన ప్రకటనలు!

కాంగ్రెస్ నేతలు.. చేతులెత్తేసిన ప్రకటనలు!

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తమపార్టీకి సొంతంగా మెజారిటీ వస్తుందనే నమ్మకాలు తమకే ఏమాత్రం లేవని తేల్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. జాతీయ స్థాయిలో తాము అధికారాన్ని సొంతం చేసుకోగలమనే విశ్వాసం తమకు ఏమీలేదని వారు చెబుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అదే విషయాన్ని సూటిగా చెప్పేశారు. తాము సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం లేవని ఆయన తేల్చిచెప్పారు.

ఎన్నికల ఫలితాల తర్వాత పెట్టుకునే పొత్తులే తమను అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కమల్ నాథ్ చాలా ప్రాక్టికల్ గా మాట్లాడారని అనుకోవచ్చు కానీ, ఇంకా పోలింగ్ సమయంలోనే ఇలా చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనే ధీమాతో ఉండేవారు, ఫలితాల తర్వాత కనీసం కూటమి ద్వారా అయినా అధికారంలోకి రావొచ్చునేమో. అయితే ముందుగానే తమకు అధికారం అందే ఛాన్సు లేదని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ లో కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో, ఆ పార్టీకి అధికారం దక్కేయోగం ఎంతవరకూ ఉందో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?