cloudfront

Advertisement


Home > Politics - Political News

ఆ హీరోని బెదిరించి ఎన్నికల్లో పోటీ చేయించారట!

ఆ హీరోని బెదిరించి ఎన్నికల్లో పోటీ చేయించారట!

భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన సన్నీడియోల్ పై కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆసక్తిదాయకమైన ప్రచారాలను చేస్తూ ఉన్నారు. సన్నీడియోల్ పంజాబ్ లోని గురుదాస్ పుర నుంచి ఎంపీగా పోటీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతూ.. వాస్తవానికి సన్నీకి ఎన్నికల బరిలో దిగాలని లేదని, క్యాండిడేట్ దొరక్క బీజేపీవాళ్లు ఆ హీరోని బెదిరించి ఎన్నికల బరిలోకి దింపారని అంటున్నారు.

పంజాబీ జాట్ కావడంతో కుల సమీకరణాలు కలిసి వస్తాయనే లెక్కలతో సన్నీడియోల్ ను గురుదాస్ పుర నుంచి బరిలోకి దించారని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. సన్నీడియోల్ సినిమా హీరోగా ముంబైలో సెటిలయ్యాడని, ఆయన ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని లుకలుకలు ఉన్నాయని, వాటిని అడ్డంపెట్టుకుని తాము చెప్పినట్టుగా వినకపోతే ఐటీ రైడ్స్ జరుగుతాయని బెదిరించి సన్నీని కమలం పార్టీ వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయించారని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.

పంజాబ్ లో బీజేపీ పోటీచేసింది మూడు ఎంపీ సీట్లకే అయినా, వాటిల్లో కూడా అభ్యర్థులను నిలుపుకోలేకపోయిందని, బెదిరించి, బతిమాలి అలా అభ్యర్థులను బరిలోకి దించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సన్నీడియోల్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిత్తుగా ఓడిస్తాడని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తంచేస్తూ ఉన్నారు.