cloudfront

Advertisement


Home > Politics - Political News

ఉప ముఖ్యమంత్రి పదవిని వద్దనేశాడు..!

ఉప ముఖ్యమంత్రి పదవిని వద్దనేశాడు..!

గెలవక గెలవక గెలవడంతో.. ఉన్నట్టుండి ముఖ్యమంత్రులను ఎంపిక చేయడం అనేది రాహుల్ కు తలకు మించిన భారమనేది అర్థం అవుతున్న విషయమే. పేరుకు జాతీయాధ్యక్షుడే అయినా రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో రాహుల్ గాంధీ తీసుకున్న సొంత నిర్ణయాలు ఏవీలేవని తెలుస్తోంది. ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో రాహుల్ అభిప్రాయానికి పెద్దగా ప్రాధాన్యత కూడా దక్కినట్టుగా లేదు.

ఈ ఎంపిక ప్రక్రియలో సోనియాగాంధీ జోక్యం ఉందని, ప్రియాంక కూడా ఈ చర్చల్లో పాలు పంచుకుందని.. ఆమె కూడా తన అభిప్రాయాలను తెలిపిందని సమాచారం. రాహుల్ కూడా చర్చలో కూర్చున్నాడని తెలుస్తోంది. అయితే అమల్లోకి వచ్చిన నిర్ణయం మాత్రం రాహుల్ ది కాదు. సోనియాగాంధీ, ఆమె ఆంతరంగికులు ఈ విషయంలో గట్టిగానే ప్రభావాన్ని చూపించారని స్పష్టం అవుతోంది.

మధ్యప్రదేశ్, రాజస్తాన్ లకు యువ ముఖ్యమంత్రులను నియమించాలి అనేది రాహుల్ ఆలోచన. అందులోనూ అటు సచిన్, ఇటు జ్యోతిరాదిత్య రాహుల్ కు సన్నిహితులు. తనమాట వినేవాళ్లు. కాబట్టి వాళ్లనే సీఎంలుగా చేయాలనేది రాహుల్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రియాంక కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని తెలుస్తోంది.

అయితే సోనియా కోటరి మాత్రం యువతకు పగ్గాలు ఇవ్వడానికి మొగ్గుచూపలేదని సమాచారం. సోనియా నిర్ణయాన్ని ప్రభావితం చేసేవర్గాలు కమల్ నాథ్, గెహ్లాట్ ల వైపే మొగ్గుచూపాయి. ఎలాగూ లోక్ సభకు సార్వత్రికల నేపథ్యంలో యంగ్ లీడర్లకు సీట్లు ఇస్తే తిరుగుబాటు రావొచ్చని వారు భయపెట్టారని సమాచారం. దీంతో చేసేదిలేక సోనియా సీనియర్ల వైపే మొగ్గు చూపిందని తెలుస్తోంది.

చివరకు ఆ నిర్ణయానికే రాహుల్ గాంధీ కూడా తలాడించాల్సి వచ్చింది. అదలా ఉంటే.. మధ్యప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా జ్యోతిరాదిత్య సింధియా నో చెప్పాడని తెలుస్తోంది. రాజస్తాన్ ఫార్ములానే ఎంపీలోనూ అమలు చేయాలని అనుకున్నా.. ఉపముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి సింధియా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా ఆయన తన అసంతృప్తిని తెలియజేసినట్టే!

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే