cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆ విషయాన్నే తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!

ఆ విషయాన్నే తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్!

లోక్ సభ సమావేశాల ప్రారంభానికి కొన్నిగంటల ముందువరకూ కూడా కాంగ్రెస్ పార్టీ సభలో తమ నాయకుడు ఎవరనే అంశం గురించి తేల్చుకోలేకపోతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇరవై రోజులు దాటిపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం లోక్ సభలో తమ పార్టీకి అధ్యక్షుడుగా ఎవరుండాలి, ఉపాధ్యక్షుడు ఎవరు, విప్ లు ఎవరనే అంశం గురించి క్లారిటీకి రాలేదు.

గత పర్యాయం లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి మల్లిఖార్జున ఖర్గే నాయకుడిగా వ్యవహరించారు. ఆ సీనియర్ దళితనేత ఈసారి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ వ్యవహారం ఎంతకూ తేలడంలేదు.

అవకాశం వస్తే సభలో కాంగ్రెస్ కు నాయకత్వం వహించడానికి తను రెడీ అని శశిథరూర్ ప్రకటన కూడా చేశారు. అయితే ఆయనకు అవకాశం ఇవ్వడానికి కాంగ్రెస్ కు కొన్ని ఇబ్బందులున్నాయనేది తెలిసిన సంగతే.

మరోవైపు వీరవిధేయులకే ఈ అవకాశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పై ఏమీ తేల్చలేకపోతున్నట్టుగా సమాచారం. మనీష్ తివారీకి ఈ అవకాశం దక్కవచ్చని మాత్రం ఊహాగానాలున్నాయి.

ఇలాంటి డ్రామాలు టీడీపీకి కొత్తేం కాదు సుమా!