cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

క‌రోనా ఎఫెక్ట్ః శృంగారంపై ఆంక్ష‌లు

క‌రోనా ఎఫెక్ట్ః శృంగారంపై ఆంక్ష‌లు

క‌రోనా పుణ్య‌మా అని ముద్దూ ముచ్చ‌ట్ల‌కు గుడ్‌బై చెప్పాల‌ని బ్రిటీష్ ప్ర‌భుత్వం  గ‌ట్టిగా చెబుతోంది. స‌ర‌సాలు చాలు చాలు, బ్యాచిల‌ర్ బ‌తుకే సో బెట‌ర్ అని స‌ల‌హా ఇస్తోంది. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు మ‌రింత క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు బ్రిటిష్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఇందులో భాగంగా లండ‌న్‌తో పాటు ఆ దేశంలోని టూ టైర్‌, త్రీటైర్ న‌గ‌రాల్లో, క‌రోనా విజృంభిస్తున్న ప్రాంతాల్లో దంప‌తులు, కుటుంబ స‌భ్యులు త‌ప్ప‌ని స‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని బ్రిటిష్ ప్ర‌భుత్వం శ‌నివారం ఉత్త‌ర్వులిచ్చింది. ముఖ్యంగా వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు, సుదీర్ఘకాలంపాటు సన్నిహిత సంబంధాలు కలిగిన జంటలు ఇంట్లో లేదా బయటైనా కలుసుకున్నప్పుడు ఆరడుగుల భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ మార్గదర్శకాల్లో పేర్కొంది.

బ్రిటిష్ ప్ర‌భుత్వం తాజాగా జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఎలాంటి లైంగిక సంబంధాల‌కు మొగ్గు చూప‌వ‌ద్ద‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టైంది. అయితే ఈ నిబంధ‌న‌లు అన్ని జంట‌ల‌కు కాద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే ఒకే ఇంట్లో ఉంటున్న  భార్యాభర్తలు, సహజీవనం సాగిస్తున్న జంటలకు ఈ నిబంధ‌న వ‌ర్తించ‌ద‌ని తేల్చి చెప్పారు.

అయితే ఉద్యోగ‌, ఉపాధి, వ్యాపార , మ‌రేయ ఇతర కార‌ణాల రీత్యా  వేర్వేరుగా జీవిస్తున్న భార్యాభర్తలు, సహజీవన జంటలు ఇంటా బయట కలసుకున్నప్పుడు  భౌతిక దూరం పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు ఇవ్వడంపై మండిప‌డుతున్నారు.   లైంగిక సంబంధాల‌పై ఆంక్ష‌లు విధించే హ‌క్కు ప్ర‌భుత్వానికి లేద‌ని, త‌మ వ్య‌క్తిగ‌త హక్కులకు భంగం కలిగించడమేనంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ సమాజంలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోందని, కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఇతర కుటుంబ సభ్యులకు సోక కుండా నివారించేందుకే ఈ నిబంధనలంటూ ప్రభుత్వం స‌మ‌ర్థించుకుంటోంది. మ‌రి ఈ నిబంధ‌న‌లు ఏ మాత్రం ఆచ‌ర‌ణ‌కు నోచుకుంటాయో మ‌రి!

 


×