Advertisement

Advertisement


Home > Politics - Political News

కరోనాలో ఆరో స్థానానికి ఎగబాకిన ఇండియా

కరోనాలో ఆరో స్థానానికి ఎగబాకిన ఇండియా

టాప్-10 కరోనా దేశాల్లో ఇండియా 6వ స్థానానికి ఎగబాకింది. నిన్నటివరకు 7వ స్థానంలో ఉన్న భారత్.. తాజాగా నమోదైన కేసులతో ఇటలీని అధిగమించి ఆరో స్థానానికి చేరింది. ప్రస్తుతం భారత్ కంటే ముందు బ్రిటిన్, స్పెయిన్, రష్యా, బ్రెజిల్, అమెరికా దేశాలున్నాయి. మరికొన్ని వారాల్లో బ్రిటిన్, స్పెయిన్ ను కూడా ఇండియా దాటేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్ లో 236,657, బ్రిటన్ లో 283,311, స్పెయిన్ లో 288,058 కరోనా కేసులున్నాయి.

ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో మరోసారి 9వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈసారి ఏకంగా 9887 కేసులు వెలుగుచూశాయి. అటు నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 294 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6642కు చేరుకుంది. ప్రస్తుతం 114,073 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 115,942 మందికి ట్రీట్ మెంట్ అందుతోంది.

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 80వేలు దాటింది. నిన్న ఒక్క రోజే ఆ రాష్ట్రంలో కొత్తగా 2436 కొత్త కేసులు నమోదయ్యాయి. 139 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2849 కు చేరుకుంది.

మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 1438 కేసులు, ఢిల్లీలో 1330 కేసులు నమోదయ్యాయి.

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?