Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎర్రన్నలకు ఇపుడే కనిపించిందా?

ఎర్రన్నలకు ఇపుడే కనిపించిందా?

ఎంత కాదనుకున్నా వామ‌పక్ష సిధ్ధాంతానికి ఒక విలువ ఉంది. కామ్రేడ్స్ అంటే నిబద్ధతలో పనిచేస్తారని, వారి విమర్శలలో సహేతుకత ఉంటాయని కూడా అంతా నమ్ముతారు.కానీ రాను రానూ గుర్రం గాడిద అయిందన్న తీరుగా రాజకీయాల్లో అన్ని విలువలూ పతనం అవుతున్నాయి. వామపక్ష నేతలు హ్రస్త్ర ద్రుష్టితో ఒక వైపే చూస్తున్నారా అన్న డౌట్లు కూడా పెరిగిపోతున్నాయి.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయం తీసుకున్నా కూడా కామ్రేడ్స్ భిన్న విధానం అవలంబించడం సిధ్ధాంతాలకు దూరంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోందంటున్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఇవాళా నిన్నా లేదు. ఆది అరవయ్యేళ్ళ చరిత్ర కలిగినది. ఇక అక్కడ జనవాసాలు కూడా అనాటి ప్రభుత్వాల చలవేనని అంటారు. ఇవన్నీ ఇలా ఉంటే రెండు దశాబ్దాలుగా చూసుకుంటే ఎల్జీ పాలిమర్స్ వద్దకు  పెద్ద ఎత్తున జనవాసాలు వచ్చేశాయి.

అప్పట్లో కూడా ఎల్జీ గ్యాస్ లీక్ అయి ప్రమాదాలు జరిగాయి. అయితే నాడు ఏ మాత్రం పట్టని వారంతా ఇపుడే కళ్ళు తెరచినట్లుగా పాలిమర్స్ అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేయడం, వెర్రికేకలు పెట్టడమే అసలైన విచిత్రం.

ఎల్జీపాలిమర్స్ లో  దుర్ఘటన జరిగి నెల రోజులు అవుతోంది. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఫ్యాక్టరీ గేటుకు తాళాలు పడ్డాయి.  అయినా సరే వామపక్ష నేతలు అక్కడ నుంచి అర్జంట్ గా పాలిమర్స్ ని తరలించాలంటూ  అందోళన చేయడమే సిసలైన రాజకీయం. ప్రతీ ఏటా జూన్ 5న పర్యావర‌వరణ దినోత్సవం జరుగుతుంది. ఈసారి మాత్రమే ఎల్జీ పాలిమర్స్ కామ్రెడ్స్ కి గుర్తుకురావడం అంటే ఎర్రన్నల‌ రూటు మారుతోందా అనిపించక మాన‌దేమో.

మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?