Advertisement

Advertisement


Home > Politics - Political News

చూడ ముచ్చ‌టైన జంట‌

చూడ ముచ్చ‌టైన జంట‌

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మ‌ధ్య సంబంధ బాంధ‌వ్యాల గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే... వీడియో లీకేజ్‌కు ముందు, ఆ త‌ర్వాత అనే చ‌ర్చ జ‌రుగుతోంది. లోకేశ్ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే పార్టీ స‌ర్వ‌నాశ‌నం అవుతోంద‌నే ఆవేద‌న అచ్చెన్నాయుడి మాటల్లో వ్య‌క్తం కావ‌డం పెద్ద ఎత్తున క‌ల‌క‌లం రేపింది. ఈ నేప‌థ్యంలో అలాంటి వీడియోల వ‌ల్ల లోకేశ్‌తో త‌న‌ను విడ‌దీయ‌లేర‌ని అచ్చెన్నాయుడు వివ‌ర‌ణ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో బుధ‌వారం అలిపిరి వ‌ద్ద నారా లోకేశ్ ప్ర‌మాణ స్వీకారం ఎపిసోడ్‌కు తెర‌తీశారు. వైఎస్ వివేకా హ‌త్య‌తో త‌న‌కు, త‌న కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని తాను ప్ర‌మాణం చేస్తాన‌ని, ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ త‌న‌కు సంబంధం లేద‌ని ప్ర‌మాణం చేయ‌డానికి రావాల‌ని లోకేశ్ స‌వాల్ విసిరారు. ప్ర‌మాణం పేరుతో సీన్ క్రియేట్ చేసేందుకు టీడీపీ నానా తిప్ప‌లు ప‌డింది. 

ఇదే సందర్భంలో గ‌తంలో ఎన్న‌డూ లేన‌ట్టుగా అచ్చెన్నాయుడితో లోకేశ్ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చనీయాంశ‌మైంది. లోకేశ్‌పై అచ్చెన్నాయుడి ఘాటు వ్యాఖ్య‌లు ఇంకా లోకాన్ని చుట్టేస్తుండ‌గానే వాళ్లిద్దరూ క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి రావ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. 

అచ్చెన్నాయుడిని త‌న ప‌క్క‌నే కూచో పెట్టుకోవ‌డం, అలాగే ఇద్ద‌రూ క‌లిసి ముందుకు సాగ‌డం, ప‌ర‌స్పరం గుస‌గుస‌లాడుకోవ‌డం ...అంతా వీడియో లీకేజీ మ‌హిమ అనే టాక్ వినిపిస్తోంది. లోకేశ్‌, అచ్చెన్నాయుడి మ‌ధ్య అన్యోన్యాన్ని చూసి చూడ ముచ్చ‌టైన జంట అనే సెటైర్స్ కూడా సోష‌ల్ మీడియాలో పేలుతున్నాయి. 

గ‌తంలో సీనియ‌ర్ల విష‌యంలో లోకేశ్ ఎప్పుడూ ఇలా గౌర‌వంగా మెలిగే వారు కాద‌ని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి. నిన్న‌టి వీడియో లీకేజీ దెబ్బ‌తో లోకేశ్ దిగి వచ్చార‌ని ఆ పార్టీ శ్రేణులే గుస‌గుస‌లాడుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?