cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మరికొద్ది సేపట్లో ఏపీలో కర్ఫ్యూ అమలు

మరికొద్ది సేపట్లో ఏపీలో కర్ఫ్యూ అమలు

ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ మొదలౌతుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు కర్ఫ్యూ మొదలుపెట్టి, మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఇలా 2 వారాల పాటు పూర్తిస్థాయిలో కర్ఫ్యూను కొనసాగించబోతున్నారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు, వ్యాపార లావాదేవీలకు అనుమతిస్తారు. ఆ టైమ్ లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అంటే, గుంపులుగా ఉండకూడదు. ప్రజలంతా కరోనా నిబంధనల్ని పాటించాలి. మరీ ముఖ్యంగా ముఖానికి మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి.

ఇక కర్ఫ్యూ సమయంలో అత్యవసర విధులకు మినహాయింపు ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలకు అందించారు. తాజా మార్గదర్శకాల దృష్ట్యా మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ అంతటా కర్ఫ్యూ అమల్లోకి రాబోతోంది. హాస్పిటల్స్ కు వెళ్లే రోగులు, వ్యాక్సిన్ కోసం వెళ్లేవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇక ఏపీ సరిహద్దులన్నీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మూసేయబోతున్నారు. పబ్లిక్ వాహనాలపై ఆంక్షలు అమలవుతాయి. అత్యవసర వాహనాలు, గూడ్స్-ట్రాన్స్ పోర్ట్ వాహనాల్ని మాత్రమే అనుమతిస్తారు. వ్యక్తిగత వాహనాల్ని అనుమతించరు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడానికి డబుల్ మ్యూటెంట్ వైరస్ కారణమని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. భారీగా వైరస్ వ్యాప్తి చెందడానికి ఇదే కారణమని నిర్థారించారు. మార్చి నెల మధ్యలో కరోనా కేసులు మొదలవ్వగా.. నెలన్నరలో ఈ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. దీనికి డబుల్ మ్యూటెంట్ వైరసే కారణమని తేల్చారు. 

ఈ విషయాలన్ని దృష్టిలో పెట్టుకొని మొన్నటివరకు రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను ఇప్పుడు పగటి పూటకు కూడా విస్తరించింది ప్రభుత్వం. 2 వారాల కర్ఫ్యూ తర్వాత మరోసారి పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటుంది. 

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×