cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మరో హీరోయిన్ కు కరోనా

మరో హీరోయిన్ కు కరోనా

బాలీవుడ్ లో మరో హీరోయిన్ కరోనా బారిన పడింది. ఇప్పటికే అలియాభట్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లను కరోనా తాకగా.. ఇప్పుడు దీపిక పదుకోన్ కూడా కరోనా బాధితురాలిగా మారింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో దీపిక పదుకోన్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆమె హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు.

ముంబయిలో లాక్ డౌన్ ముగిసిన తర్వాత భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి బెంగళూరు వెళ్లింది దీపిక పదుకోన్. తల్లిదండ్రులతో కలిసి కొన్నాళ్లు గడపాలని నిర్ణయించుకుంది. అయితే దురదృష్టవశాత్తూ దీపిక వెళ్లిన టైమ్ కే తండ్రి ప్రకాష్ పదుకునే తో పాటు.. తల్లి, చెల్లెలు కూడా కరోనా బారిన పడ్డారు.

వయసురీత్యా ముందుజాగ్రత్త చర్యగా ప్రకాష్ పదుకొణెను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. దీపిక తల్లి, సోదరి హోం క్వారంటైన్ లో ఉంటూ, వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు దీపిక కు కూడా పాజిటివ్ రావడంతో.. కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్టయింది.

భర్త రణ్వీర్ సింగ్ తో కలిసి 83 అనే సినిమా చేసింది దీపిక. పఠాన్ సినిమాలో కూడా నటిస్తోంది. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది దీపిక.

అణచివేయాలని చూస్తే ప్రజలు ఆగ్రహిస్తారు

లోకేష్ నిజంగా చదువుకునే డిగ్రీలు సంపాదించాడా?

 


×