Advertisement

Advertisement


Home > Politics - Political News

ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కన్నుమూత

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత షీలాదీక్షిత్ కన్ను మూశారు. ఆమె వయస్సు 81 ఏళ్లు. ఆమె ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1938 మార్చి 31వ తేదీన పంజాబ్ లోని కపుర్తలలో జన్మించారు. అత్యధిక కాలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత షీలాదీక్షిత్ ది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె 15 ఏళ్ల పాటు పనిచేశారు.

షీలాదీక్షిత్ 1998 నుంచి 2013 వరుసగా శానససభకు ఎన్నికయ్యారు. ఢిల్లీకి ఆమె ఆరో ముఖ్యమంత్రిగా పనిచేశారు.1998, 2008 ఎన్నికల్లో గోల్ మార్కెట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి పోటీచేసి ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేరళ గవర్నర్ గా పనిచేసారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?