Advertisement

Advertisement


Home > Politics - Political News

దేశానికి నాలుగు రాజధానులు

దేశానికి నాలుగు రాజధానులు

రాజకీయ నాయకులకు కొత్త కొత్త ఆలోచనలు తడుతున్నాయి. ఆంధ్రకు మూడు రాజధానులు వుండాలని సిఎమ్ జగన్ భావిస్తే, దేశానికి నాలుగు వైపులా నాలుగు రాజధానులు వుండాలని బెంగాల్ సిఎమ్ మమత బెనర్జీ అంటున్నారు. 

బ్రిటిష్ వారు కలకత్తా కేంద్రంగా పాలించారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసారు.ఇక్కడ విశేషం ఏమిటంటే మమత మరో అడుగు ముందుకు వేసి మరో మాట కూడా అన్నారు. 

'దేశానికి ఒకేనాయకుడు, ఒకే రాజధాని లాంటి కాలం చెల్లిన మాటలు వద్దు..నాలుగు దిక్కుల్లో నాలుగు రాజధానులు వుండాలి' అన్నది మమత మాట. ఈ మాట మోడీని ఉద్దేశించి అన్నదే అన్న సంగతి అందరికీ అర్థమవుతూనే వుంది. 

ప్రాంతీయ భావాలు రేకెత్తించడమే మోడీ భాజపా జాతీయ నినాదానికి విరుగుడు అని మమత భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం మీద కేంద్రీకృత పాలన నుంచి వికేంద్రీకరణ దిశగా నాయకుల ఆలోచనలు, అడుగులు సాగడం విశేషం.

ఏపీలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలయ్యేనా?

క‌థ మొత్తం బంగారం చూట్టే

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?